Home » రాజకీయాల్లో కృష్ణకు, జమునకు ఉన్న పోలిక తెలుసా ?

రాజకీయాల్లో కృష్ణకు, జమునకు ఉన్న పోలిక తెలుసా ?

by Bunty
Published: Last Updated on
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సావిత్రి, జమున, షావుకారు, జానకి, అంజలీదేవి, కృష్ణకుమారి అలనాటి హీరోయిన్లలో మేటి హీరోయిన్లు. ఒక్కొక్క హీరోయిన్ దాదాపుగా వందలాది సినిమాల్లో నటించేవారు. అలా సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ జమున. ఆమె ఏ పాత్రలో చేసిన ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. అయితే జమున అప్పట్లో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరితో జతకట్టింది.

Advertisement

 

ఇక ఆమె ఎక్కువగా హీరో హరినాథ్ తో నటించిన వీరి కాంబినేషన్ లో దాదాపుగా చాలా సినిమాలు వచ్చాయి. అందులో చాలా వరకు సూపర్ హిట్. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమాలు లేత మనసులు. ఈ మూవీ జమున కెరియర్ ను మలుపు తిప్పిందని చెప్పవచ్చు. రాజకీయ నాయకురాల్లో ఆమె, సైతం తనదైన ముద్ర వేసుకున్నారు. 1989 లో కాంగ్రెస్ నుంచి రాజమండ్రి ఎంపీగా విజయం సాధించి మంచి పేరు తెచ్చుకున్నారు.

Advertisement

మిస్సమ్మ, ఇలవేల్పు, గుండమ్మ కథ, ఇల్లరికం, లేత మనసులు చిత్రాలతో మంచిపేరు తెచ్చుకున్నారు. జమునకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె కుటుంబంతో కలిసి హైదరాబాద్ బంజారాహిల్స్ లో జమున నివాసం ఉంటున్నారు. ఆ తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ఆమె మళ్లీ రాజకీయాల వైపు చూడలేదు. కృష్ణ కూడా ఏలూరు నుంచి ఎంపీగా ఓడిపోయిన తర్వాత మళ్లీ రాజకీయాల వైపు అడుగులు వేయలేదు.

READ ALSO : టీచర్లకు కేసీఆర్ సర్కార్ శుభవార్త.. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం

Visitors Are Also Reading