Home » హీరో రానా పేరు వెనుక ఉన్న అస‌లు రహస్యం ఇదే..? సురేష్ బాబు రానాకు ఆ పేరు ఎలా పెట్టారంటే..?

హీరో రానా పేరు వెనుక ఉన్న అస‌లు రహస్యం ఇదే..? సురేష్ బాబు రానాకు ఆ పేరు ఎలా పెట్టారంటే..?

by Bunty
Ad

టాలీవుడ్‌ స్టార్‌ హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి పనిలేదు. హీరోగా, అలాగే విలన్ గా బాగా రాణిస్తున్నాడు రానా. తెలుగు ఇండస్ట్రీలో రానా మాదిరి అన్ని పాత్రల్లో నటించిన నటులు చాలా తక్కువగా ఉన్నారు. విలన్ గా చేస్తాడు. హీరోగా నటిస్తాడు. అదే సమయంలో చిన్న పాత్రలో నటించమంటే అది కూడా చేస్తాడు. పదేళ్ల కెరీర్లో ఇప్పటివరకు రానా ఎన్నో అద్భుతాలు చేశాడు. దాంతో పాటు ఈయన కెరీర్ లో కొన్ని ఆసక్తికరమైన నిజాలు ఉన్నాయి.


రానా నటుడిగా మారకముందు నిర్మాతగా ఉన్నారు. బొమ్మలాట సినిమాతో నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. అంతేకాదు యానిమేషన్ రంగంలో కూడా రానా తనదైన ముద్ర వేశాడు. విజువల్ ఎఫెక్ట్స్ సమన్వయకర్తగా దాదాపు 70 సినిమాలకు పైగానే పనిచేసిన అనుభవం రానా సొంతం. అవన్నీ చేసిన తర్వాతే లీడర్ సినిమాతో హీరో అయ్యాడు రానా. ఇది ఇలా ఉండగా, ఇక రానా అసలు పేరు రామానాయుడు. అయితే రానా అని పేరు ఎలా పెట్టారో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. దానికి ఒక పెద్ద హిస్టరీ ఉందట. మొదట రానాకు సిద్ధార్థ్ అనే పేరును పెట్టాలని అనుకున్నారట రానా తల్లి లక్ష్మి.

Advertisement

Advertisement

rana

అయితే బారసాల రోజున కొడుకు పేరు రాయాలని పంతులుగారు చెప్పినప్పుడు సురేష్ బాబు తన తండ్రి పేరైన రామానాయుడు పేరును రాసేసారట. తాను ఎవరికీ చెప్పలేదని, నాన్న పేరు పెట్టాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి పెట్టేసానని సురేష్ బాబు ఒక సందర్భంగా తెలిపారట. సురేష్ బాబు చేసిన పనికి రామానాయుడు గారు చాలా సంతోషించారట. అయితే నాన్న ఫ్రెండ్ ఒకాయన రామానాయుడు అని తాను పిలవలేనని, రామానాయుడు పదాల్లోని మొదటి అక్షరాలు కలిపి రానా అని పిలుస్తానని చెప్పాడట. అలా రానా అనే పేరు స్థిరపడిపోయిందట.

READ ALSO : కొరటాల శివ భార్య ఎవరు…ఆమె ఏం చేస్తుందో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు !

Visitors Are Also Reading