Home » వాకింగ్‌ చేస్తే కూడా నష్టాలు ఉన్నాయి..బాగా నడిస్తే, ప్రమాదంలో పడ్డట్టే !

వాకింగ్‌ చేస్తే కూడా నష్టాలు ఉన్నాయి..బాగా నడిస్తే, ప్రమాదంలో పడ్డట్టే !

by Bunty
Ad

 

వాకింగ్‌..ప్రతి ఒక్కరికి అవసరం. ఎంత పని ఒత్తిడిలో ఉన్న, మీ సమయంలో ఉన్న అరగంట సమయాన్ని వాకింగ్ కి వెచ్చిస్తే చాలా మంచిది. వాకింగ్ చేయడం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. నిజంగా వాకింగ్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు మనం చెక్ పెట్టొచ్చు. కాబట్టి రెగ్యులర్ గా ఎంత పనిలో ఉన్నా సరే అరగంటసేపు వాకింగ్ కోసం మీ సమయాన్ని వెచ్చించండి. నడవడం వల్ల మెదడు పనితీరు నుండి కంటిచూపు వరకు ఎన్నో ప్రయోజనాలను మనం పొందవచ్చు. మరి వాకింగ్ వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు ఉన్నాయట. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

వాకింగ్ చేయడం వల్ల ప్రయోజనాలు

ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల ఎక్కువ ఆక్సిజన్ మన శరీరానికి వెళ్తుంది. అదేవిధంగా మన శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు వచ్చేస్తాయి. దీంతో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకుంటాయి. రెగ్యులర్ గా వాకింగ్ చేస్తే పేగులు బాగా కదులుతాయి. దీని కారణంగా పేగులు క్రమ పద్ధతిలోకి వస్తాయి. మలబద్ధకం వంటి సమస్యలు కూడా దీని కారణంగా రావు. అలానే క్యాన్సర్ సమస్యలు కూడా రాకుండా ఇది చూసుకుంటుంది.

Advertisement

వాకింగ్ చేయడం వల్ల నష్టాలు ?

మన శరీరానికి వాకింగ్ అనేది చాలా అవసరం. రోజుల్లో గంటల తరబడి వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు, కనీసం రోజుకి ఒక అరగంట పాటు వాకింగ్ చేస్తే సరిపోతుంది. కొంతమంది బిజీ లైఫ్ ఉండడం వల్ల ఉదయం పూట వాకింగ్ చేయలేనివారు ఎక్కువగా సాయంత్రం సమయంలో వాకింగ్ చేస్తారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉదయం పూట 5 నుంచి 6 మధ్యలో అంటే అమృత ఘడియల్లో వాకింగ్ చేయడం వల్ల ఆక్సిజన్ స్థాయి ఎక్కువగా ఉంది ఆరోగ్యానికి చాలా మేలు ఉంటుంది. ఎటువంటి కలుషితమైన వాతావరణంలేని సమయంలో వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరు దాటిన తర్వాత పొల్యూషన్ ఉండడం వల్ల హాని కలిగించే వాయువులు ఎక్కువగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల ఆరోగ్యానికి మంచి కన్నా చెడు ఎక్కువ అవుతుంది. ఉదయం పూట ఒక అరగంట సమయం వాకింగ్ కు కేటాయించడం వల్ల మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి వాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

READ ALSO : ఏపీ నిరుద్యోగులకు అలర్ట్‌.. కానిస్టేబుల్ హాల్ టికెట్లు విడుదల..ఇలా డౌన్‌ లోడ్‌ చేసుకోండి

Visitors Are Also Reading