Home » RCB జట్టుకు ABd హెచ్చరికలు..ఇలాంటి ప్లేయర్లను తీసేయండి !

RCB జట్టుకు ABd హెచ్చరికలు..ఇలాంటి ప్లేయర్లను తీసేయండి !

by Bunty
Ad

ఐపీఎల్ లో టైటిల్ కొట్టాలని ప్రతి జట్టు కలలు కంటూ ఉంటుంది. కానీ మొదటి సీజన్ నుంచి ఇప్పటివరకు టైటిల్ కొట్టకుండా ఉన్న జట్టు జట్లలో ఆర్సిబి ముందు వరుసలో ఉంది. ఈ జట్టులో భారీ హిట్టర్స్ ఉన్నారు. భారీ స్కోర్స్ చేస్తారు. కానీ మ్యాచ్ గెలవదు. ఒకవేళ లీగ్ మ్యాచ్ లో గెలిచిన కానీ ప్లే ఆఫ్స్ లో కానీ, ఫైనల్స్ లో కానీ గెలవదు. ఆర్సిబి టైటిల్ కొట్టాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. కనీసం 2024 ఐపీఎల్లోనైనా ఆర్సిబి విజేతగా నిలవాలని ఫ్యాన్స్ తో పాటు ఆ జట్టుకు ఆడిన మాజీ ఆటగాళ్లు సైతం కోరుకుంటున్నారు.

Advertisement

అలాంటి సమయంలో ఆర్సిబి మాజీ స్టార్ ఆటగాడు ఏబి డెవిలియర్స్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆర్సిబి 2024 ఐపీఎల్ కోసం దినేష్ కార్తీక్ ని ఎందుకు మళ్ళీ తీసుకున్నారన్నది అర్థం కావడం లేదని చెప్పాడు. ఐపీఎల్ 2023లో దినేష్ కార్తీక్ 13 మ్యాచ్లలో 11.66 సగటుతో 140 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్లో ఆర్సిబి ప్లే ఆఫ్స్ కు చేరకపోవడానికి దినేష్ కార్తీక్ కూడా ఒక కారణం. బ్యాట్స్మెన్ గా, కీపర్ గా విఫలమయ్యాడు. అలాంటి కార్తీక్ ని మళ్ళీ 2024 ఐపీఎల్ కోసం రిటైన్ చేయడంతో ఎబి డెవిలియర్ షాక్ అయ్యాడు. 37 ఏళ్ల కార్తీక్ ని మళ్లీ తీసుకోవడం చూసి ఆశ్చర్యపోయానని డెవిలియర్స్ తెలిపాడు. హసరంగా, హర్షల్ పటేల్, జోస్ హేజీల్ వుడ్ ను ఆర్సిబి వదిలేసింది. వీరు మ్యాచ్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. అలాంటి వారిని ఆర్సిబి రిలీజ్ చేసింది.

Advertisement

కానీ దినేష్ కార్తీక్ కి మాత్రం జట్టులో చోటు ఇచ్చింది. దానితో నేను షాక్ అయ్యానని ఏబి డెవిలియర్స్ చెప్పాడు. ఆయన చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక చాలామంది ఆర్సిబి ఫ్యాన్స్ కూడా కార్తీక్ ని తీసుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అతన్ని తీసేయాలని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఎ బి డెవిలియర్ చాలా ఏళ్లు ఐపిఎల్ లో ఆర్సిబికి ఆడాడు. భారీగా పరుగులు చేశాడు. కోహ్లీకి, ఏ బి డెవిలియర్స్ కి మంచి అనుబంధం ఉంది. మరి డెవిలియర్స్ చేసిన వాక్యాలకు దినేష్ కార్తీక్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading