Home » RCBలోకి మరో భీకరమైన ప్లేయర్..ఈ సారి కప్ వారిదే

RCBలోకి మరో భీకరమైన ప్లేయర్..ఈ సారి కప్ వారిదే

by Bunty

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఐపీఎల్ 16వ సీజన్ కి సంబంధించిన షెడ్యూల్ మ్యాచ్ ల వివరాలను బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 31న ఐపీఎల్ 2023 ఎడిషన్ కి తెరలేవనుంది. ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభ వేడుకలను ఆహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు.  ఈ క్రమంలో టోర్నీ ఆరంభానికి కొన్ని రోజుల ముందే ఆర్సిబికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆటగాడు విల్ జాక్స్ గాయం కారణంగా ఐపీఎల్ 2023 కు దూరం అయ్యాడు. ఇప్పటివరకు ఐపీఎల్ బరిలో దిగని ఈ ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ ను ఆర్సిబి ఐపిఎల్ 2023 వేలంలో దక్కించుకుంది. కానీ, దురదృష్టవశాత్తు అతను బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ లో గాయపడి ఐపిఎల్ కు దూరమయ్యాడు.

READ ALSO : Sir Movie : “సార్” మూవీ OTT డేట్ లాక్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

 

అయితే అతని స్థానంలో న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ ప్రస్తుతం భీకర ఫామ్ లో ఉన్న బ్రేక్ వెల్ ను ఆర్సిబి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బ్రేస్ వెల్ తో ఆర్సిబి యాజమాన్యం సంప్రదింపు సైతం జరిపినట్లు తెలుస్తోంది. ఆర్సిబి తరఫున ఆడేందుకు బ్రేస్ వెల్ సైతం ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే, బ్రేస్ వెల్ ఆర్సిబితో జతకడితే, జట్టు మరింత పటిష్టం కావడం కాయం బ్యాటింగ్ తో పాటు

READ ALSO: మాస్టర్ సినిమా హీరోయిన్ సాక్షి శివానంద్ ఎంతలా మారిపోయిందో చూడండి!

బౌలింగ్ లోను ఆర్సీబీ దుర్బేధ్యంగ మారుతుంది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లేసిస్, రజత్ పటీదార్, మ్యాక్స్ వెల్, ఫిన్ అలెన్, దినేష్ కార్తీక్, హేజల్ వుడ్, సిరాజ్, హసరంగ, షాబాజ్ అహ్మేద్ తో కూడిన జట్టుకు బ్రెస్ వెల్ లాంటి ఆల్ రౌండర్ తోడైతే మంచి ఫలితాలు సాధించవచ్చు. బ్రెస్ వెల్ ను ఆర్సిబి తీసుకుంటుందనే వార్త తెలియడంతో సోషల్ మీడియాలో అప్పుడే ఆర్సిబి అభిమానులు రచ్చ మొదలుపెట్టారు.

READ ALSO : హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు..నెలకు రూ.35 వేల జీతం

Visitors Are Also Reading