భారతదేశ త్రివిధ దళాల జనరల్ బిపిన్ రావత్ మృతి అందరిని శోకసంద్రంలో ముంచేసింది. ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ప్రస్తుతం దేశం మొత్తం రావత్ ధైర్య సాహసాల గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి చర్చ నడుస్తోంది. జనరల్ రావత్ సతీమణి మధూలిక గురించి, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి సర్చ్ చేస్తున్నారు. మధులిక మధ్యప్రదేశ్లోని సుహాగ్ పూర్ లోని రాజవంశానికి చెందిన మహిళ. ఆమె తండ్రి పేరు కున్వర్ మృగేంద్ర సింగ్. ఆయన 1967, 1972 లో స్థానికంగా ఎమ్మెల్యేగా గెలిచారు. మధులిక కు యశ్వర్ధన్ అనే తమ్ముడు. ఇక 1986 లో బిపిన్ మధులికల వివాహం వైభవంగా జరిగింది.
Advertisement
Advertisement
తాజాగా మధులిక సోదరుడు ప్రమాదం పై స్పందిస్తూ తమిళనాడులోని కోనూరు వద్ద హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్లుగా, హెలికాప్టర్లు బిపిన్ మధులిక కూడా ప్రయాణిస్తున్నట్లుగా తన తల్లికి తెలియకూడదని చాలా ప్రయత్నించారట. మధులిక తల్లి, బిపిన్ అత్తగారు 82 ఏళ్ల ప్రభ సింగ్ ఎలాగోలా ఈ విషయాన్ని తెలుసుకోండి అని చెప్పుకొచ్చారు. ఇక ఇక తమ కుటుంబంతో రావత్ చాలా ఆత్మీయంగా వ్యవహరించేవారు అంటూ యశ్వర్ధన్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన తల్లికి ఈ వయసులో ఆ విషయం తెలియకూడదని టీవీ ఆఫ్ చేసినప్పటికీ ఆమెకు ఎలాగోలా విషయం తెలిసిందని బాధ పడ్డారు. ఇక బిపిన్ , మధులిక ఎప్పుడూ కలిసి అధికారిక కార్యకలాపాలకు వెళ్లలేదని, మొదటిసారి వెళ్లగా ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.