Home » రవి తేజ తో జత కట్టనున్నఈ భామ ఎవరో తెలుసా ?

రవి తేజ తో జత కట్టనున్నఈ భామ ఎవరో తెలుసా ?

by AJAY
Ad

మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా విజయంతో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇప్పటికే కిలాడి సినిమా షూటింగ్ పూర్తి కాగా ఈ ఏడాది విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగానే రవితేజ మరో రెండు సినిమాలను పట్టా లెక్కించాడు. అందులో ఒకటి రామారావు ఆన్ డ్యూటీ కాగా మరొకటి ధమాకా. ఇక రామారావు డ్యూటీ సినిమా కూడా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో రవితేజ పక్కన హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించినట్టు సమాచారం అందుతోంది. ఈ పాటలో రవితేజ తో పాటు  తారగా పేరు పొందిన అన్వేషి జైన్ స్టెప్పులు వేసినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో అన్వేషి జైన్ కు  తార‌గా పేరుంది. అన్వేషి జైన్ వెబ్ సిరీస్ ల‌తో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది.

Advertisement

దాంతో అన్వేషి జైన్ ను స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక రామారావు సినిమాలో రవితేజ ఎమ్మార్వోగా కనిపించబోతున్నాడన్న‌ సంగతి తెలిసిందే. నిజాయితీ గల ప్రభుత్వ అధికారిగా రవితేజ ఈ సినిమాలో అల‌రించ‌నున్నాడు. ఈ చిత్రానికి శ‌ర‌త్ మండ‌వ దర్శకత్వం వహిస్తున్నారు.

అదేవిధంగా చెరుకు సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ కరోనా థర్డ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడే అవకాశం కూడా ఉంది. ఇక రవితేజ అన్వేషి జైన్ స్పెషల్ సాంగ్ లో ఈ మేరకు అల‌రించారో చూడాలంటే వేచి చూడాల్సిందే.

Visitors Are Also Reading