Telugu News » Blog » న‌వ్వుతోనే ఫిదా చేసిన ర‌వితేజ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది..? ఏం చేస్తుందో తెలుసా..!

న‌వ్వుతోనే ఫిదా చేసిన ర‌వితేజ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది..? ఏం చేస్తుందో తెలుసా..!

by AJAY
Published: Last Updated on
Ads

సినిమా ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోయిన్ లు వ‌స్తుంటారు పోతుంటారు. కానీ అతికొద్ది మాత్రమే ప్రేక్ష‌కుల హృదయాల‌లో స్థానం సంపాదించుకుంటారు. అలాంటి హీరోయిన్ ల‌ను ప్రేక్ష‌కులు ఎప్పుడూ మ‌ర్చిపోరు. కానీ అది అంత ఈజీ కాదు అందం అభిన‌యంతో పాటూ టాలెంట్ కూడా ఉండాలి. అలా అందం అభిన‌యంతో పాటూ టాలెంట్ ఉన్న హీరోయిన్ మ‌ల‌యాల కుట్టి గోపిక‌. ఇలా పేరు చెబితే గుర్తుప‌ట్ట‌క‌పోవ‌చ్చు కానీ నా అటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాలో ర‌వితేజ్ కాలేజీ గ‌ర్ల్ ఫ్రెండ్ అంటే మాత్రం ఆమె ముఖం ట‌క్కున గుర్తుకు వ‌స్తుంది.

naa-autograph-heroine

 

గోపిక ఈ సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఎక్క‌డా అందాల ప్ర‌ద‌ర్శ‌న ఉండ‌దు…రొమాంటిక్ సీన్లు కూడా ఉండ‌వు. కానీ త‌న అందంతో పాటూ స్వ‌చ్చ‌మైన న‌వ్వు మ‌రియు న‌ట‌న‌తోనే గోపిక్ ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. ర‌వితేజ గోపిక మ‌ధ్య సన్నివేశాలు ఉన్నంత‌సేపు ఇది సినిమానా లేదంటే నిజంగానే మ‌న‌కండ్ల ముందు జ‌రుగుతుందా అన్న అనుమానం కూడా క‌లుగుతుంది. ఇక ఈ సినిమా త‌ర‌వాత గోపిక లేత‌మ‌న‌సులు, యువ‌సేన అనే సినిమాల్లో న‌టించింది.

ఇండ‌స్ట్రీలో అందం టాలెంట్ ఉంటే స‌రిపోదు కొండంత అదృష్టం కూడా కావాలంటారు. అయితే గోపిక‌కు అదృష్ణం లేదో ఏమో కానీ ఈ సినిమాలు ఆశించిన మేర విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో తెలుగులో మ‌ళ్లీ క‌నిపించ‌లేదు. కానీ మ‌ల‌యాళంలో ఈ ముద్దుగుమ్మ ముప్పై వ‌ర‌కూ సినిమాల్లో న‌టించింది. ఇక ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంటున్న ఈ భామ ఏం చేస్తుంది…ఎలా ఉంది అని తెలుసుకోవాల‌ని చాలా మంది తెలుగు ప్రేక్ష‌కులు కోరుతున్నారు.

కాబ‌ట్టి గోపిక ఎం చేస్తుందో తెలుసుకుందాం.. కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే గోపిక ఐర్లాండ్ కు చెందిన అజిలీస్ చాకు అనే డాక్ట‌ర్ ను వివాహం చేసుకుంది. ఆ త‌ర‌వాత చాలా కాలం పాటూ గోపిక ఫోటోల‌కు బ‌య‌ట‌కు రాలేదు. కాగా ఇప్పుడు గోపిక దంప‌తులకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. క‌రోనా స‌మ‌యంలో గోపిక త‌న ఫోటోల‌ను త‌న ఫ్యామిలీ ఫోటోల‌ను షేర్ చేయ‌డంతో నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

ALSO READ :మహేష్ బాబు అన్న రమేష్ బాబు ఫ్యామిలీని ఎప్పుడైనా చూసారా..?


You may also like