Home » రవితేజ వారసత్వం మొదలు కాబోతుందా..?

రవితేజ వారసత్వం మొదలు కాబోతుందా..?

by Azhar
Ad

కోహ్లీ సెంచరీలు కాకుండా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలి…!

టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న చాలా మంది హీరోలు బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన వారే. అయితే కొంతమంది ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి.. తర్వాత తమ వారసులకు టాలీవుడ్ లోకి రప్పిస్తారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన ఏ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోకి వచ్చారు. కానీ ఇప్పుడు మెగా కాంపౌండ్ నుండి ఏకంగా డజను మంది హీరోలు మన టాలీవుడ్ లో ఉన్నారు. వారినే మన మెగా ఫ్యామిలీ అని పిలుస్తాం. అయితే మెగాస్టార్ మాదిరే మన టాలీవుడ్ లోకి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన మరో హీరో మాస మహారాజ రవితేజ.

Advertisement

మొదట సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చి.. తర్వాత హీరోగా తనను తాను నిలదికొక్కుకొని.. ఇప్పుడు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు రవితేజ. అయితే ఈయనకు మన టాలీవుడ్ లో హీరోగా మంచి పొజిషన్ ఉంది. అందుకే రవితేజ కూడా ఇప్పుడు తన వారసత్వాన్ని టాలీవుడ్ లోకి దించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ కొడుకు చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చాడు. కానీ ఇప్పుడు హీరోగా వస్తుంది మాత్రం అతను కాదు. రవిజేత కుటుంబం నుండి తన సోదరుని కొడుకు మాధవ భూపతిరాజు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

అయితే మాధవ మొదటి సినిమా రమేష్ వర్మ డైరెక్షన్ లో రావాలి. కానీ రవితేజకు అతనికి వచ్చిన విమర్శల నేపథ్యంలో ఇప్పుడు మరో కొత్త దర్శకుడు తన సోదరుని కొడుకున లాంచ్ చేయాలనీ మాస మహారాజ భావిస్తున్నాడు. అయితే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత నల్లమలపు బుజ్జి నిర్మించబోతున్నారు. అయితే ఇప్పటికే బుజ్జితో రవితేజ టచ్ చేసి చూడు అనే సినిమా చేసాడు. కానీ ఈ సినిమా ప్లాప్ అయ్యింది. అయితే ఇప్పుడు తీసే సినిమా మాత్రం తప్పకుండ హిట్ అవుతుంది అని బుజ్జి, రవిజేత ఇద్దరు నమ్మకంతో ఉన్నారట. అయితే ఈ సినిమా హిట్ అయ్యి మాధవ హీరోగా నిలదొక్కుకుని తర్వాత రవితేజ తన కొడుకును టాలీవుడ్ లోకి తీసుకువస్తాడు అని అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ ఇక మళ్ళీ ఎప్పటికి కెప్టెన్ కాడు..!

కోహ్లీ సెంచరీలు కాకుండా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలి…!

Visitors Are Also Reading