టాలీవుడ్ ప్రముఖ నటుడు చలపతిరావు నేడు ఉదయం గుండె పోటుతో మరణించిన సంగతి తెలసిందే. చలపతి రావు వందల చిత్రాలలో నటించి నటుడుగా ఎంతో గుర్తింపు సాధించారు. సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలం నుండి నేటి హీరోల వరకూ స్టార్ హీరోల సినిమాలలో విలన్ గా మరియు పాజిటివ్ రోల్స్ లో నటించి తన నటనతో మెప్పించారు. చలపతి రావు మరణంతో టాలీవుడ్ లో విషాదం నిండుకుంది. రీసెంట్ కైకాల మరణం నుండే ఇంకా టాలీవుడ్ తేరుకోలేదు ఇంతలోనే చలపతిరావు మరణవార్త వినాల్సి వచ్చింది.
Advertisement
టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో చలపతిరావుకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన మరణం తరవాత నందమూరి కుటుంబానికి కూడా ఆయన ఎంతో దగ్గరి వ్యక్తి అయ్యారు. ప్రతి ఒక్కరూ చలపతిరావును బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి చలపతిరావు ఆది సినిమాలో నటించగా ఆయన మరణవార్త విని జూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఇదిలా ఉంటే చలపతి రావు తనయుడు రవిబాబు కూడా నటుడుగా మరియు దర్శకుడుగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు.
Advertisement
రవిబాబు అల్లరి సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అవును సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడుగా మెప్పించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. కాగా తండ్రి మరణం తరవాత రవిబాబు మీడియాతో మాట్లాడారు.
సినిమాల్లోకి తను ఎంట్రీ ఇచ్చిన తరవాతనే తన తండ్రి గొప్పతనం తెలిసిందని చెప్పాడు. ఇండస్ట్రీలో చాలా మందికి సాయం చేసినా తమకు కూడా చెప్పేవారు కాదని అందరినీ కలుపుకుపోవడం వల్లనే ఆయనకు బాబాయ్ అనే పేరువచ్చిందని చెప్పారు. తన తండ్రికి జీవితంలో ఇష్టమైన మూడు విషయాలు ఎన్టీఆర్, ఆహారం, జోకులు వేయడం అని చెప్పారు.