Home » Ravi Theja Rare Photo Gallery : ఇప్పటివరకు ఎవరూ చూడని రవితేజ రేర్ ఫోటో గ్యాలరీ!

Ravi Theja Rare Photo Gallery : ఇప్పటివరకు ఎవరూ చూడని రవితేజ రేర్ ఫోటో గ్యాలరీ!

by Bunty
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు రవితేజ. రవితేజ సినిమా అంటేనే అన్ని హంగులు కలగలిపి అన్ని భావాలు చూపించగల టాలెంట్ ఉన్న హీరో. అలాంటి రవితేజ తన నటనతో లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకొని మాస్ మహారాజా రవితేజ గా మారారు.

Advertisement

ఇడియట్, విక్రమార్కుడు వంటి సినిమాలతో ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. అలాంటి మాస్ మహారాజా గత కొంతకాలంగా ఇండస్ట్రీలో కాస్త వెనుకబడుతూ వస్తున్నాడు. దీనికి ప్రధాన కారణం ఆయన సినిమాలు ప్లాప్ అవడం. అయితే తాజాగా మాస్ మహారాజా ధమాకా సినిమాతో మన ముందుకు వచ్చారు. ఈయన తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో జన్మించారు. భూపతి రాజు రాజగోపాల్ రాజు-రాజ్యలక్ష్మి దంపతులకి ముగ్గురు కొడుకులు.

raviteja

raviteja

అందులో మొదటి వాడే రవితేజ. అయితే మొదట్లో సినిమాలలో చిన్నచిన్న వేషాలు వేసిన రవితేజకి పెద్దగా గుర్తింపు రాలేదు. అలా 1997 లో కృష్ణవంశీ సింధూరం సినిమాలో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా చేశాడు రవితేజ. ఈ సినిమాలో రవితేజ చేసిన చంటి పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా చాలా సినిమాలలో గుర్తింపు ఉన్న వేషాలు వేసినప్పటికీ బ్రేక్ రాలేదు. ఇక 1999 లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన నీకోసం సినిమాలో రవితేజ హీరోగా చేశాడు. ఆ తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు వంటి చిత్రాలు రవితేజకి హీరోగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి.

Advertisement

Visitors Are Also Reading