Home » చిరంజీవి సినిమా నుండి రవితేజ ఔట్.. ఎందుకంటే..?

చిరంజీవి సినిమా నుండి రవితేజ ఔట్.. ఎందుకంటే..?

by Azhar
Ad
ప్రస్తుతం మన టాలీవుడ్ లో మల్టి స్టారర్ సినిమాలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఈ ట్రెండ్ ను సీనియర్ హీరోలు బాగా ఫాలో అవుతున్నారు. అందులో విక్టరీ వెంకటేష్ ముందుంటాడు. ఆ తర్వాత ఈ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా కలిసిన విషయం తెలిసిందే. తాజాగా చిరంజీవి మరో సూపర్ స్టార్ అయిన మాస్ మహారాజ రవితేజ కలిసి ఓ సినిమాలో నరిస్తున్నారు అనేది అందరికి తెలిసిందే. వరుస సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాబీ దర్శకత్వంలో కూడా ఓ సినిమాలో నరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు వల్తేరు వీరయ్య అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసారు.
ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటుగా మరో ముఖ్య పాత్ర ఉంటుందని.. దానికోసమే రవితేజను తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే గతంలో చిరంజీవి, రవితేజ కలిసి అన్నయ అనే సినిమాలో నటించాడు. ఇక వ్యక్తిగతంగా కూడా రవితేజ చిరంజీవికి పెద్ద ఫ్యాన్. ఆయనను చూసే సినిమాలోకి వచ్చాను అని రవితేజ చాలాసార్లు చెప్పాడు. ఆ కారణంగానే చిరంజీవి సినిమాలో మళ్ళీ ఛాన్స్ రావడంతో వెంటనే ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు రవితేజ చిరంజీవి సినిమా నుండి బయటకు వచ్చినట్లు తెలుస్తుంది.
ఎందుకంటే.. ఇప్పుడు చిరంజీవి, రవితేజ వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే మొదట ఈ వల్తేరు వీరయ్య సినిమా అనుకున్న డేట్స్ లో రవితేజకు ఛాన్స్ ఉండటంతో ఆ సినిమాలో చేస్తాను అని కమిట్ అయ్యాడట. కానీ ఇప్పుడు చిరంజీవి సినిమాలు ఆలస్యం అవుతుండటంతో వల్తేరు వీరయ్య సినిమా అనేది ఆలస్యంగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. కానీ ఆ సమయంలో రవితేజ డేట్స్ అనేవి ఖాళీగా లేకపోవడంతో ఈ సినిమా నుండి మాస్ మహారాజ తప్పనుకునట్లు తెలుస్తుంది. దాంతో బాబీ ఇప్పుడు మరో హీరోను వెతికే పనిలో పడినట్లు తెలుస్తుంది.

Advertisement

Visitors Are Also Reading