Home » చిరు సినిమాలో చేరిపోయిన మాస్ మహారాజ..!

చిరు సినిమాలో చేరిపోయిన మాస్ మహారాజ..!

by Azhar
Ad

సినిమా ప్రపంచంలో తెరకెక్కే కొన్ని కాంబినేషన్స్ అనేవి సినిమా అభిమానులకు చాలా హైప్ అనేవి క్రియేట్ చేస్తాయి. ఇక ఈ మధ్యలో మన తెలుగులో ఇటువంటి సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ మధ్య టాలీవుడ్ లో ఇద్దరు హీరోలు కలిసి మల్టి స్టారర్ సినిమాలు చేయడం అనేది పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లో మాస్ మహారాజ రవితేజ, మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయారు. అయితే ఈ ఇద్దరు కలిసి అప్పుడెప్పుడో అన్నయ సినిమాలో నటించారు. కానీ అప్పుడు రవితేజకు అంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది లేదు.

Advertisement

కానీ ఇప్పుడు రవితేజకు ప్రత్యేకమైన గుర్తింపుతో పాటుగా… ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అలాగే ఎవరి అండ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు అనే మంచి పేరు కూడా ఉంది. అయితే మెగా ఫ్యామిలీ పేరుతో సినిమాలోకి ఎంత మంది వచ్చినా.. దానిని నిర్మించిన చిరంజీవి కూడా ఎవరి అండ లేకుండానే సినిమాలోకి వచ్చాడు అనే విషయం తెలిసిందే. అలంటి వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఒక్కే సినిమాలో నటించడం అనేది విపరీతమైన హైప్ అనేది క్రియేట్ చేస్తుంది. అయితే ఇప్పుడు మెగాస్టార్ వరుస సినిమాలు చేస్తున్నాడు.

Advertisement

అందులో ఇప్పుడు అయితే ఒక్కేసారి మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో మెగాస్టార్ 154వ సినిమాగా బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో రవితేజ నటిస్తున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ ప్రోమోను ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది. అందులో రవితేజ ఎంట్రీ ఇచ్చి.. మెగాస్టార్ కాన్వాయ్ వద్దకు వెళ్లి.. అన్నయ పిలవగా.. చిరు డోర్ తీసి బయటకు రాకుండా తమ్ముడు అంటూ రవితేజను లోపలి తీసుకెళ్లాడు. ఆ ఆతర్వాత దర్శకుడు బాబీ వచ్చి.. మెగా మాస్ కాంబో అంటూ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీకి పాకిస్థాన్, ఇంగ్లాడ్ కెప్టెన్ల సపోర్ట్…!

కోహ్లీని తీసేస్తే బీసీసీఐకే నష్టం.. ఎలా అంటే..?

Visitors Are Also Reading