Home » చిరు సినిమాలో రవితేజ పాటనే హైలెట్..!

చిరు సినిమాలో రవితేజ పాటనే హైలెట్..!

by Azhar
Ad

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేస్తున విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యే చిరంజీవి చేస్తున్న సినిమాలో తనతో పాటుగా మరో హీరో ఉండేలా చూసుకుంటున్నాడు. ఆ మార్గంలోనే ఆచార్యలో రామ్ చరణ్, గాడ్ ఫాధర్ లో సల్మాన్ ఖాన్ ను ఉంచుకున్నాడు. ఇక ఇప్పుడు చేస్తున్న ఈ వాల్తేరు వీరయ్య సినిమాల్లో రవితేజను పెట్టుకున్నాడు చిరు.

Advertisement

అయితే ప్రస్తుతం టాలీవుడ్ లోనే అందరికంటే ఎక్కువ సినిమాలు లైన్ లో పెట్టుకున్న రవితేజ… కేవలం మెగాస్టార్ కోసమే ఈ వాల్తేరు వీరయ్య సినిమాలో చేస్తున్నాడు అనేది అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా కీలకం అనేది మొదట్లోనే చిత్ర బృందం చెప్పేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి రవితేజకు అంబాధించిన మరి విషయం కూడా తెలుస్తుంది.

Advertisement

అదేంటంటే.. ఈ వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజకు ఓ ఫన్నీ సాంగ్ అనేది ఉందట.ఆ పాట అనేది మొత్తం సినిమాకే హైలెట్ అనేది తెలుస్తుంది. ఇక ఇందులో రవితేజతో పాటుగా చిరు కూడా స్టెప్పు కలపనున్నాడు అని సమాచారం. ఇక తాజాగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ పాటను షూట్ చేసారు అని.. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీ చేసాడు అని తెలుస్తుంది. చూడాలి మరి ఈ పాట అనేది ఎలా ఉంటుంది.. ఇందులో చిరు, రవితేజ ఎలా స్టెప్పులు వేశారు అనేది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీకి ఐసీసీ ట్రిబ్యూట్..!

పాకిస్థాన్ ఫ్యాన్ కు లక్షల ఫైన్ వేసిన ఆస్ట్రేలియా..!

Visitors Are Also Reading