Home » పాండ్య రిటైర్మెంట్ ఇస్తాడు అని చెప్పిన రవిశాస్త్రి..!

పాండ్య రిటైర్మెంట్ ఇస్తాడు అని చెప్పిన రవిశాస్త్రి..!

by Azhar

ఇప్పుడు క్రికెట్ లో ఎక్కువగా రిటైర్మెంట్స్ అనేవి నడుస్తున్నాయి. చాలా మంది ఆటగాళ్లు ఆటకు పూర్తిగా వీడ్కోలు ఇస్తుంటే… ఇంకొందరు ఏదో ఒక్క ఫార్మాట్ కు వీడ్కోలు అనేది ఇస్తున్నారు. అయితే ఈ మధ్యే ఇదే తరహాలో ప్రస్తుత క్రికెట్ లోనే మేటి ఆల్ రౌండర్లలో ఒక్కడైనా బెన్ స్టోక్స్ వన్డే ఫార్మాట్ కు తన రిటైర్మెంట్ అనేది ఇచ్చాడు. ఇప్పుడు తాను ఎక్కువ క్రికెట్ అనేది ఆడుతున్న కారణంగా వన్డేల పైన కోసం పెట్టలేకపోతున్నాను అని.. అందుకే వీడ్కోలు పలుకుతున్నాను అని చెప్పాడు. ఇక తాను తన ఫోకస్ అనేది మొతం టెస్ట్ మరియు టీ20 క్రికెట్ పైన పెడతాను అన్ని చెప్పాడు. అయితే ఇపుడు మన టీం ఇండియా ఆల్ రౌండర్ హెది పాండ్య కూడా స్టోక్స్ ను ఫాలోఅవుతాడు అని చెప్పాడు రవిశాస్త్రి.

భారత జట్టు యొక్క మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తాజాగా హార్దిక్ పాండ్య గురించి సంచనల విషయాలను వెల్లడించాడు. పాండ్య ఎక్కువగా టీ20 క్రికెట్ అనేది ఆడటానికి ఇష్టపడుతారు. కానీ అతను ఇప్పుడు వన్డేలలో ఆడేది కూడా వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ ఉంది అనే. ఆ కారణం వల్లనే అతను ఇప్పుడు ఈ 50 ఓవర్ల ఫార్మాట్ ఆడుతున్నాడు. ఈ వరల్డ్ కప్ అనేది అయిపోయిన తర్వాత మనం పాండ్యను వన్డేలలో చూడటం కష్టమే అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

అయితే జట్టులో ఉండే ఏ ఆటగాడికి అయిన సరే ఏ ఫార్మాట్ ఆడాలి అనేది నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛ అనేది ఉంటుంది. అందువల్ల ఈ ప్రపంచ కప్ అయిన తర్వాత చాలామంది ఆటగాళ్లు తమ నిర్ణయం అనేది తీసుకుంటారు.ఆ అయితే ఇప్పటికి టెస్ట్ మ్యాచ్ నుం చాలా మంది ఇష్టపడుతున్నారు. అందువల్ల అందులో ఆడుతారు. కానీ వన్డే ఫార్మాట్ ను కేవలం ఈ ప్రపంచ కప్ ను పెట్టుకొని కొనసాగించడం అనేది చాలా కష్టం. ఇప్పుడు టీ20 క్రికెట్ ట్రెండ్ అనేది నడుస్తుంది. అలాగే లీగ్ క్రికెట్ కు ఆటగాళ్లు ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందుకే వన్డే క్రికెట్ కొనసాగడం కష్టంగా అయ్యింది.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐ కొత్త సాఫ్ట్‌వేర్… ఆటగాళ్ల వయస్సు కోసం..?

రిపోర్టర్ వింత ప్రశ్న… అద్భుతమైన సమాధానం ఇచ్చిన చాహల్..!

Visitors Are Also Reading