భారత జట్టు బ్యాటింగ్ ఐకాన్ అయిన విరాట్ కోహ్లీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనే విషయం అందరికి తెలిసిందే. పరుగుల వరద పారించే కోహ్లీ బ్యాట్ అనేది ఇప్పుడు చిన్న కాలువను కూడా పారించలేకిపోతుంది. దాంతో కోహ్లీ ఆడిన క్రికెట్ లో సగం కూడా ఆడని వారు.. కోహ్లీ చేసిన పరుగులతో పావు వంతు కూడా చేయవరి వారు అందరూ కోహ్లీకి బ్యాటింగ్ ఎలా చేయాలి అనే విషయంలో సలహాలు ఇస్తున్నారు.
Advertisement
అయితే ఇంగ్లాండ్ పర్యటన తర్వాత పూర్తిగా విశ్రాంతి అనేది తీసుకున్న కోహ్లీ… ఇప్పుడు నేరుగా ఆసియా కప్ లో అది పాకిస్థాన్ తో మళ్ళీ బ్యాట్ అనేది పట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీ పై భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కొన్ని కామెంట్స్ చేసాడు. ఆయా మాట్లాడుతూ.. పెద్ద ఆటగాళ్లు ఎప్పుడు కూడా సరైన సమయంలో పరుగులు చేస్తారు. కోహ్లీ కూడా అంతే.
Advertisement
అయితే ఇప్పుడు కోహ్లీ ఫామ్ లో లేడు. కాబట్టి అతనిపైన పెద్దగా అంచనాలు ఎవరికీ ఉండవు. అందుకే ఇలాంటి సమయంలో పాకిస్థాన్ తో మ్యాచ్ లో కోహ్లీ ఒక్క హాఫ్ సెంచరీ చేస్తే చాలు.. ఇప్పుడు అతడిని విమర్శిస్తున్న అందరూ మళ్ళీ పొగుడుతారు. కోహ్లీ ఒక్క ఇన్నింగ్స్ చాలు. ప్రజలు కూడా గతాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకోరు. కాబట్టి కోహ్లీ ఒక్క హాఫ్ సెంచరీ చేస్తే మళ్ళీ పాత బాటలోకి వస్తాడు అని రవిశాస్త్రి అన్నారు.
ఇవి కూడా చదవండి :