Home » Ravanasura Trailer : అదరగొట్టిన మాస్ మహారాజ్..గత్తర్ లేపిన “రావణాసుర” ట్రైలర్

Ravanasura Trailer : అదరగొట్టిన మాస్ మహారాజ్..గత్తర్ లేపిన “రావణాసుర” ట్రైలర్

by Bunty
Ad

ధమాకా మూవీ సూపర్ సక్సెస్ తో మాస్ మహారాజా రవితేజ మళ్ళీ గాడిలో పడ్డాడు. ఈ మూవీ 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఇప్పుడు అతడు తన నెక్స్ట్ మూవీ రావణాసురపై ఆశలు పెట్టుకున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీపై రవితేజ అభిమానుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.

read also : Nidhhi Agerwal – Venu Swamy: నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి పూజలు.. ఇదిగో వీడియో!

Advertisement

ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకి రానున్న రావణాసుర మూవీపై భారీ అంచనాలు నెలకోన్నాయి. రావణాసుర టీజర్ కి సూపర్ రెస్పాన్స్ రావడం, సాంగ్ కి ట్రేమండస్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ ఎక్స్పెక్టేషన్ ని పీక్ స్టేజ్ కి తీసుకువెళ్లడానికి మేకర్స్ తాజాగా రావణాసుర ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

Advertisement

read also : TV9 దేవీ నాగవల్లిపై మరోసారి రెచ్చిపోయిన విశ్వక్ సేన్!

Trailer of Ravi Teja's Ravanasura to be out on this date- Cinema express

ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కట్ చేసి విడుదల చేసిన ఈ ట్రైలర్ లో రవితేజ యాక్టింగ్, డైలాగ్స్, హైపర్ ఆది కామెడీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ చిత్రంలో ఓ క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు రవితేజ. “మ***ర్  చేయడం క్రైమ్… దొరక్కుండా  మ***ర్ చేయడం ఆర్ట్” అంటూ రవితేజ చెప్పే మాస్ డైలాగ్ కి థియేటర్లో విజిల్స్ పడడం పక్కా. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాతో రవితేజ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో తెలియాలంటే ఏప్రిల్ 7 వరకు వేచి చూడాల్సిందే.

 

Visitors Are Also Reading