కర్ణి మాత దేవాలయం.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 వేల ఎలుకలు కర్ణి మాత ఆలయం లో ఉన్నాయి. భక్తులు, ఆలయ నిర్వాహకులు వీటిని జాగ్రత్తగా చూసుకుంటారు. 20 వేల ఎలుకల్లో కేవలం నాలుగు తెల్ల ఎలుకలుంటాయి. అవి కేవలం ఒక సమయంలో మాత్రమే కనిపిస్తాయి. ఆలయంలో మీరు నడుస్తున్నప్పుడు పొరపాటున మీ కాళ్ళ కింద ఒక ఎలుక నలిగిపోతే ఇక అంతే.. తిరిగి మీరు బంగారు ఎలుక ప్రతిమను ఇవ్వాల్సిందే. అయితే ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందామా.. రాజస్థాన్ రాష్ట్రంలోని దేశ్ నూక్ వద్ద ఉన్న కర్ణి మాత ఆలయం ప్రపంచంలోనే ఉన్న వింతైన దేవాలయాల్లో ఒకటి.
ఈ ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చే భక్తులు ఎలుకలను పూజిస్తారు. వీటిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుండి చాలా మంది భక్తులు వస్తారు. ఆలయంలో చెల్లాచెదురుగా ఉన్న పాలు, కొబ్బరి చిప్పలు ఇతర ఆహార పదార్థాల చుట్టూ కూడా ఎలకలు డజన్ల కొద్ది కనిపిస్తాయి. అయితే ఈ ఎలుకలను కాళ్ళ కింద పడకుండా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలుకలను చాలా భద్రంగా చూసుకుంటారు. ఈ దేవాలయంలో కుటుంబాలతో సహా శాశ్వతంగా నివసించే పూజారులు, సంరక్షకులు ఉన్నారు. వీళ్లు ఎలుకలకు ఆహారాన్ని ఇవ్వడంతోపాటు వాటి విసర్జనను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారు. శక్తికి మూల మైనటువంటి దుర్గాదేవి యొక్క ఉపాసకులురాలే కర్ణి మాత.
Advertisement
Advertisement
కర్ణి మాత కు చిన్నతనం నుండి ఉన్న అతీంద్రియ శక్తుల వల్ల ప్రజల కష్టాలను తొలగిస్తూ ఉండేదట. దీంతో ప్రజలందరూ ఆమెను దేవతగా కొలిచేవారు. ఒకరోజు కర్ణి మాత అదృశ్యం అవ్వడంతో భక్తులు ఆమె ఇంటి వద్దే ఈ ఆలయాన్ని నిర్మించారు. దాంతో కర్ణిమాత భక్తులకు కనిపించి తన వంశం వారు త్వరలోనే చనిపోయి తిరిగి ఎలుకలుగా జన్మించి ఈ ఆలయం లోనే ఉంటారని వారిని సేవిస్తూ ధన్యులు కాండి అంటూ అనుగ్రహించిందట. ఇక అప్పటినుండి ఇక్కడ వేలాది సంఖ్యలో నల్ల ఎలుకలు ఉన్నాయట. కర్ణి మాత ఆలయానికి ఏడాది పొడవునా వేలాది భక్తులు, పర్యాటకులు వస్తూ ఉంటారు.
ALSO READ;
మహేష్ సర్కారు వారి పాట ట్రైలర్ విడుదల.. ఎలా ఉందంటే..?
“ఫేక్ బాడీ” అంటూ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటో పై దారుణమైన ట్రోల్స్…!