Home » హీరోయిన్ రష్మికను ఆ బ్రాండ్ అంబాసిడర్ నుంచి తొలగింపు..కారణమేంటి..?

హీరోయిన్ రష్మికను ఆ బ్రాండ్ అంబాసిడర్ నుంచి తొలగింపు..కారణమేంటి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా పుష్ప సినిమా ద్వారా నేషనల్ క్రష్ గా మారింది అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న. ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె ఈ స్థాయికి రావడానికి అనేక కష్టాలు అనుభవించింది. ఈ విధంగా ఒక్కో మెట్టెక్కుతూ చివరికి తన అందాలతో కుర్రకారు కి చెమటలు పుట్టించే హీరోయిన్ గా మారింది. అలాంటి రష్మిక మందన్న గురించి కొన్ని విషయాలు చూద్దాం.. సాధారణంగా ఇండస్ట్రీలో ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి. ఆ విధంగా ఉంటేనే ఇండస్ట్రీలో కొనసాగగలం. అలా కాకుండా స్టార్డం రాగానే ఆకాశానికి నిచ్చెన వేస్తే ఎంతటి వారికైనా పతనం తప్పదు..

Advertisement

also read:సమంత ఆరోగ్యం పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన సమంత టీమ్..!!

ఈ విషయాలను గ్రహించుకొని ఇండస్ట్రీలో స్టార్ డం కొనసాగిస్తున్న వారు అనేకం ఉన్నారని చెప్పవచ్చు. అయితే పుష్ప సినిమాతో ఎంతో పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న మాత్రం ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వివాదాల్లో చిక్కుకుంది. కేవలం ఈమె మాట తీరు వల్ల కన్నడ ఇండస్ట్రీ ఏకంగా తనపై బ్యాన్ విధించాలనే నిర్ణయం తీసుకున్నారట. కన్నడ చిత్ర పరిశ్రమ గురించి, అలాగే కన్నడ భాష గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు ఆమె పతనానికి కారణం అవుతున్నాయని తెలుస్తోంది. ఈమె కన్నడ చిత్ర పరిశ్రమ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలో వచ్చిన కాంతారా సినిమా గురించి కూడా పలు కామెంట్స్ చేసింది.

Advertisement

ఈ సినిమా చూసే అంత టైం నాకు లేదని చెప్పడం పెద్ద వివాదానికి కారణమైంది. దీంతో కన్నడ ప్రేక్షకులు రష్మిక పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విధంగా రష్మిక మందన్న పట్ల పూర్తి వ్యతిరేక భావన ఏర్పడడం వల్ల ప్రముఖ బ్రాండ్లు ఈమెను బ్రాండ్ అంబాసిడర్ గా తొలగిస్తున్నట్లు సమాచారం. మరీ ముఖ్యంగా ఖజానా జ్యువెలరీ పూర్తిగా రష్మికను వారి బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు. కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది.దీనిపై రష్మిక స్పందిస్తే అసలు విషయం బయటకు వస్తుంది.

also read:

Visitors Are Also Reading