Home » రష్మిక చేసిన ఆ కామెంట్ ఆమె కెరీర్ ని ప్రమాదం లో పడేసింది..! కాంతార హీరో పై నోరు జారి.. !

రష్మిక చేసిన ఆ కామెంట్ ఆమె కెరీర్ ని ప్రమాదం లో పడేసింది..! కాంతార హీరో పై నోరు జారి.. !

by AJAY

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు సక్సెస్ ఉంటుందో.. ఎప్పుడు గ్రాఫ్ పడిపోతుందో తెలియదు. కాబట్టి ఒక హిట్టు పడగానే పొంగిపోకూడదు. స్టార్ స్టేటస్ రాగానే మురిసిపోకూడ‌దు. అలా చేస్తే ఎక్కడ మొదలుపెట్టారో అక్కడికి రావడం పక్కా. ఇప్పటికే ఇది చాలా మంది నటీనటుల్లో రుజువైంది కూడా. అలాగే ఇప్పుడు హీరోయిన్ రష్మిక వ్యవహారం కూడా హాట్ టాపిక్ గా మారింది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన రష్మిక మందన కిరిక్ పార్టీ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు కాంతార సినిమా ద‌ర్శ‌కుడు, హీరో రిష‌బ్ శెట్టి దర్శకత్వం వ‌హించాడు. ఈ చిత్రంలో రక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో రష్మికకు కూడా క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ లో రష్మిక ఛ‌లో సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఛ‌లో తర్వాత గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత పుష్పతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది.

 

అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ…. తాను నటి కావాలని అనుకోలేదని అందం నటన చూసి అవకాశాలు నడిచి వచ్చాయని కామెంట్ చేసింది. అంతేకాకుండా మీ కెరీర్ లో ఎలా ప్రారంభమైంది అంటూ యాంక‌ర్ ప్రశ్నించగా…. కాలేజీ రోజుల్లో మోడలింగ్ చేస్తున్నాను. ఆ సమయంలో ఈ సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ నుండి కిరాక్ పార్టీ సినిమా ఆఫర్ వచ్చింది అంటూ రెండు చేతులతో సైగలు చేస్తూ చెప్పింది.

తనకు ఆఫర్ ఇచ్చిన రిష‌బ్ శెట్టి బ్యానర్ పేరును మెన్షన్ చేయకుండా చేతులతో సైగలు చేసింది. దాంతో ఒక్కసారిగా కన్నడ మూవీ లవర్స్ రష్మికపై ఓ రేంజ్ లో మండిపడ్డారు. సోషల్ మీడియాలో బ్యాన్ రష్మిక అంటూ ట్వీట్ లు చేశారు. ఇదిలా ఉంటే రిష‌బ్ శెట్టి కాంతార సినిమాతో పాన్ ఇండియా లెవ‌ల్ లో డైరెక్టర్ గా… నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే.

ఇక ఓ ఇంటర్వ్యూలో రిష‌బ్ శెట్టి…. ఫ్యూచర్ లో సమంత, సాయి పల్లవిల‌ తో సినిమాలు చేస్తాను కానీ సో కాల్డ్ హీరోయిన్లతో చేయను అంటూ రష్మిక లాగే సైగలు చేస్తూ చూపించాడు. వీరిద్దరి మధ్య వివాదం చూస్తుంటే కన్నడ నాట రష్మికకు అవకాశాలు రావడం ఇక కల‌ గానే మిగిలిపోతుందేమో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Visitors Are Also Reading