కన్నడ ఇండస్ట్రీలో కిరిక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రష్మిక మందన. మొదటి సినిమాతోనే రష్మిక బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా విజయం తర్వాత వరుస ఆఫర్ లను అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పటివరకు 17 సినిమాల్లో నటించగా ఈ అమ్మడి హిట్ ట్రాక్ ఎక్కువగానే ఉంది.
Advertisement
ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో మరియు కోలీవుడ్ లోనూ రష్మిక సినిమాలు చేస్తోంది. అంతేకాకుండా స్టార్ హీరోలతో జోడి కడుతోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తనకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటానని చెప్పింది. తాను స్కూల్ లో చదువుకునే రోజుల్లోనే కుటుంబానికి దూరంగా హాస్టల్ లో ఉండేదాన్ని అని పేర్కొంది.
Advertisement
Rashmika
తనతో పాటు హాస్టల్ లో 800 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ తనతో ఎవరూ సరిగ్గా ఉండేవారు కాదని చెప్పింది. తాను చేయని తప్పులకు కూడా మాటలు పడేదాన్ని అని వెల్లడించింది. ప్రతిరోజు గదిలో కూర్చొని ఏడ్చే దానిననీ తెలిపింది. అయితే తన సమస్యలు అన్నింటిని అమ్మతో పంచుకోవడం తనకు అలవాటు అని పేర్కొంది. అదే తనను స్ట్రాంగ్ గా మార్చిందని చెప్పింది.
rashmika
తనకు అది అలవాటైపోయిందని… అందుకే తాను ఇంత స్ట్రాంగ్ గా ఉంటానని స్పష్టం చేసింది. ఇలాంటి అనుభవాలను చిన్నప్పటినుండి చూసాను కాబట్టే మనసులో ఎంత బాధ ఉన్నా బయటకు నవ్వుతూనే ఉంటానని తెలిపింది. అంతేకాకుండా విజయ్ తో టూర్ లకు వెళ్లడం పై సైతం స్పందించింది. విజయ్ తనకు మంచి ఫ్రెండ్ అని టూర్ లకు వెళితే తప్పేంటి అని వ్యాఖ్యానించింది.
Advertisement
Also read : ఒకే సమయంలో రెండు మొబైల్స్ లో ఒకే నెంబర్ తో వాట్సాప్ వాడొచ్చు.. అది ఎలాగో తెలుసా ?