Home » బ్లాక్ బస్టర్ బంగార్రాజును మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్…!

బ్లాక్ బస్టర్ బంగార్రాజును మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్…!

by AJAY
Ad

నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాని నాగార్జున నిర్మించారు. ఇక సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున హీరోగా నటించారు. బంగార్రాజు సినిమాల్లో నాగార్జున నాగచైతన్య కలిసి నటించారు.

Banggaraju

Advertisement

ఇక ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించగా నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటించింది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి కరోనా సమయం లోనూ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి పాత్రకు ఎంతో ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించేందుకు మొదట కృతి శెట్టి నో చెప్పిందట.

Advertisement

 

మరో రెండు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ అవుతాయా లేదా అని కృతి శెట్టి బంగార్రాజు లో నటించేందుకు నో చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో చిత్ర యూనిట్ నేషనల్ క్రష్ రష్మిక మందనను సంప్రదించాలని నిర్ణయించుకున్నారట. అయితే చిత్ర యూనిట్ రష్మీక దక్కరకు వెళ్లడానికి ముందు కృతి శెట్టి నుండి మరో కాల్ వచ్చిందట. కృతి శెట్టి మేనేజర్ ఫోన్ చేసి డేట్స్ అడ్జస్ట్ చేస్తామని బంగార్రాజు సినిమాలో కృతి శెట్టి నటిస్తుందని మాట ఇచ్చారట. అలా ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఫైనల్ అయింది. దాంతో కృతి శెట్టి ఖాతాలో మరో సూపర్ హిట్ పడిపోయింది.

Visitors Are Also Reading