సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ లు రెండు మూడుసార్లు కలిసి తిరిగితే చాలు డేటింగ్ లో ఉన్నారు లవ్ లో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొస్తాయి. ఆధారాలు లేకుండానే లవ్ డేటింగ్ అంటూ ప్రచారం మొదలవుతుంది. ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక విషయంలోనూ అదే జరుగుతోంది. రష్మిక ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా రానిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ముద్దుగుమ్మ కన్నడ ఇండస్ట్రీ నుండి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
Advertisement
అయితే టాలీవుడ్ లో సక్సెస్ తరవాత మొదటి బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టికి బ్రేకప్ చెప్పింది. అప్పటికే రక్షిత్ శెట్టితో రష్మికకు ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. అంతే కాకుండా ఆ తరవాత రష్మిక విజయ్ తో డేటింగ్ లో ఉందంటూ టాక్ వినిపించింది. వీరిద్దరూ కలిసి విహారయాత్రలకు కూడా వెళ్లారు. అంతేకాకుండా కలిసి మూడు నాలుగు సార్లు చక్కర్లు కొడుతూ మీడియాకు కూడా దొరికిపోయారు.
Advertisement
Advertisement
ఇదిలా ఉంటే ఇప్పుడు రష్మిక విజయ్ దేవరకొండకు కూడా బ్రేకప్ చెప్పిందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అంతే కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ తో ప్రేమలో ఉందని డేటింగ్ లో ఉన్నారని టాక్ మొదలయ్యింది. అయితే అలా వార్తలు రావడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రష్మిక రెండు మూడు సార్లు బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి మీడియా కంటపడింది. దాంతో బెల్లంకొండతో డేటింగ్ లో ఉందంటూ వార్తలు మొదలయ్యాయి.