టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక షాకింగ్ కామెంట్ లు చేసింది. తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఈ సంధర్బంగా బ్యూటీ మాట్లాడుతూ…చిన్నచిన్న విషయాలు కూడా జీవితంలో తనకు ఎంతో ముఖ్యమైనవని చెప్పింది. ప్రతిరోజూ లేచినతరవాత కుక్కపిల్లలతో ఆడుకుంటానని చెప్పింది. అది ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పింది. మాటలతోనే మనిషిని నిలబెట్టవచ్చని మాటలు ఎంతో శక్తివంతవైనవని చెప్పింది.
కానీ ఆ మాటలతోనే మనిషి మనసును ముక్కలు కూడా చేయవచ్చని చెప్పింది. అంతే కాకుండా తన డైరీలో ప్రతివిషయాన్ని రాసుకుంటానని అందులో ముఖ్యమైన విషయం ఒకటి చెబుతానని షాకింగ్ నిజాలు బయటపెట్టింది. ప్రతిరోజూ ఇంటికి రాగానే అందరి కాళ్లకు నమస్కరిస్తానని చెప్పింది. కేవలం కుటుంబ సభ్యులవి మాత్రమే కాకుండా ఇంట్లోని పనిమనుషుల పాదాలకు కూడా నమస్కరిస్తానని చెప్పింది.
Advertisement
వాళ్లను వేరుగా చూడనని అందరినీ గౌరవిస్తానని చెప్పుకొచ్చింది. అదేవిధంగా పేరెంట్స్ గురించి మాట్లాడుతూ….అందరూ అనుకుంటున్నట్టుగా మా పేరెంట్స్ నన్ను చూసి గర్వపడరు అంటూ కామెంట్ చేసింది. దానికి కారణం వాళ్లు సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటారని చెప్పింది. అసలు నేనేం చేస్తానో కూడా వాళ్లకు తెలియదని కానీ ఏదైనా అవార్డు వస్తే మాత్రం ఉప్పొంగిపోతారని చెప్పింది. వాళ్లు ఇంకా సంతోషపడాలి అంటే నేను ఇంకా సాధించాలని చెప్పింది. తనను చిన్ననాటి నుండి పేరెంట్స్ ఏ లోటు లేకుండా పెంచారని తెలిపింది.
ALSO READ : మంచు మనోజ్ కి అనుచరుడిగా ఉన్న సారథి ఎవరో తెలుసా ?