Home » అనసూయ స్థానంలో జబర్దస్త్ యాంకర్ గా ఎవరు..?

అనసూయ స్థానంలో జబర్దస్త్ యాంకర్ గా ఎవరు..?

by Azhar
Ad

జబర్దస్త్ అనే కార్యక్రమం ఎంత పాపులారిటీని సంపాదించిందో అందరికి తెలుసు. ఈ షోకు పోటీగా ఎన్ని షోలు వచ్చినా కూడా అవి ఏవి నిలబడలేదు. అయితే ఈ షో నుండి ఎంతోమంది పేరు అలాగే డబ్బు అనేది సంపాదించుకున్నారు. అందులో కేవలం ఆర్టిస్టులు టీం లీడర్లు మాత్రమే కాకుండా యాంకర్లు కూడా బాగానే అందుకునేవారు. అయితే జబర్దస్త్ కార్యక్రమమికి యాంకర్ గా అనసూయ ఇన్ని రోజులు చేసిన విషయం తెలిసిందే. ఈ షోకు ముందు అంతగా పాపులర్ కానీ అనసూయ జబర్దస్త్ వల్ల చాలా పేరు అనేది తెచ్చుకుంది.

Advertisement

ఆలాగే ఈ జబర్దస్త్ వల్లే అనసూయకు సినిమా ఆఫర్లు అనేవి రావడం మొదలయ్యాయి. అయితే ఇప్పుడు అనసూయ జబర్దస్త్ ను వదిలేసింది. తనకు ఎక్కువగా సినిమా ఆఫర్లు వస్తునందున తాను ఇంకా జబర్దస్త్ లో చేయలేను అని చెప్పింది. కానీ ప్రజలు మాత్రం అది నమ్మడం లేదు. అనసూయకు వేరే షోలో వచ్చినా ఆఫర్ల వల్లే తాను జబర్దస్త్ మానేస్తుంది అని అంటున్నారు. ఏదిమైన అనసూయ వెళ్లిన తర్వాత జబర్దస్త్ యాంకర్ పోస్ట్ ను ఎవరు భర్తీ చేస్తారు అనే ప్రశ్న ఇప్పుడు రాగ.. సమాధానంగా రష్మీ పేరు వస్తుంది. ఈ మధ్యే సుధీర్ వెళ్లిపోయిన తరువాత అతను చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్ గా రష్మీ వస్తుంది.

Advertisement

అందుకే ఇప్పుడు అనసూయ వెళ్లిన తర్వాత ఆ స్థానంలోకి కూడా రష్మీనే వస్తుంది అని తెలుస్తుంది. అయితే ఈ జబర్దస్త్ ప్రారంభమైన మొదట్లో దానికి అనసూయ యాంకర్ గా కొన్ని ఎపిసోడ్స్ చేసి.. తర్వాత వెళ్ళిపోయింది. అప్పుడు ఆ స్థానంలో రష్మీ యాంకర్ గా వచ్చింది. కానీ మళ్ళీ ఈ జబర్దస్త్ కు మంచి పేరు రేటింగ్స్ వచ్చినా తర్వాత అనసూయ తిరిగి రావడంతో ఆ స్థానం నుండి రష్మీని తప్పించారు. ఇప్పుడు కూడా అనసూయ వెళ్ళిపోయింది కాబట్టి ఆ స్థానంలో యాంకర్ గా రష్మీ రానున్నట్లు తెలుస్తుంది. మరి మళ్ళీ భవిష్యత్లో అనసూయ తిరిగి వస్తే మళ్ళీ అనసూయను తీసుకుంటారా లేదా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

రాహుల్ ద్రావిడ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కైఫ్…!

కోహ్లీకి పాకిస్థాన్ లో పెరుగుతున్న మద్దతు..!

Visitors Are Also Reading