జబర్దస్త్ కొత్త జోడీ సుజాత రాకేష్ ఇప్పుడు ట్రెండింగ్ పెయిర్ గా మారిపోయారు. వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా..? లేదంటూ టీఆర్పీ కోసం నటిస్తున్నారా అనేది చెప్పడం కూడా చాలా కష్టంగా మారిపోయింది. దానికి కారణం ఎప్పటికప్పుడు వీరిద్దరూ ఒకరిపై మరొకరు ప్రేమను ప్రదర్శిస్తూ ఎమోషనల్ డైలాగులు కొట్టడమే. ఇక తాజాగా వచ్చిన జబర్దస్త్ ప్రోమోలో అయితే సుజాత తనకు రాకేష్ పై ఎంత ప్రేమ ఉందో బయటపెట్టేసింది.
Advertisement
నువ్వేం సంపాదిస్తున్నావు…నీ దగ్గర ఏం ఉంది..? అని నేను ఎప్పుడైనా అడిగానా నాకు కావాల్సింది నేను నీతో జీవితాంతం సంతోషంగా ఉండటం. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. సుజాత డైలాగ్ విన్న రోజా వెంటనే రాకేష్ వేరే అమ్మాయితో వెళ్లిపోతే ఏం చేస్తావు సుజాత అంటూ ప్రశ్నించింది. దానికి సుజాత ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది.
Advertisement
రాకేష్ వేరే అమ్మాయితో వెళ్లిపోతాడు అంటే తనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పింది. కానీ వెళ్లే అమ్మాయి మంచి అమ్మాయి అయి ఉండాలని తెలిపింది. అంతే కాకుండా రాకేష్ ఆ అమ్మాయితో సంతోషంగా ఉంటానంటే తనకు రాకేష్ సంతోషమే ముఖ్యమని చెప్పింది.
ఇక సుజాత అలా రాకేష్ ప్రేమచూపిస్తుంటే రష్మి కన్నీళ్లు పెట్టుకుంది. దాంతో రష్మి ఎందుకు కన్నీళ్లు పెట్టుకుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో సుధీర్ రష్మిలు కూడా ప్రేమలో ఉన్నారంటూ వైరల్ అయిన సంగతి తెలిసిందే. కానీ తరవాత అవి ఫేక్ వార్తలు అంటూ క్లారిటీ వచ్చేసింది.