Home » ఇండియా ఒక్క ఏడాదిలో 60 మంది ఆటగాళ్లను ఆడిస్తుందా..?

ఇండియా ఒక్క ఏడాదిలో 60 మంది ఆటగాళ్లను ఆడిస్తుందా..?

by Azhar
Ad
కరోనా తర్వాత నుండి భారత జట్టులో భారీ మార్పులు అనేవి జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక గత ఏడాది నుండి ఒక్కేసారి రెండు జట్లను కూడా ఆడిస్తూ వస్తుంది. కానీ మ్యాచ్ విన్నర్స్ లేక.. ఐసీసీ టైటిల్ అనేది గెలవలేకపోతుంది. గత ఏడాది ప్రపంచ కప్ లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయిన ఇండియా.. ఈ ఏడాది ఆసియా కప్ లో దాయాదితో జరిగిన రెండు మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ ఓడిపోయింది.
అయితే ప్రస్తుతం భారత జట్టు ఆటతీరు పై పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ మాట్లాడుతూ… భారత జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లను తప్పిస్తే.. వారు ఏడాదిలో 60 మంది కొత్త ఆటగాళ్లను జట్టులోకి తెస్తున్నారు. కానీ వారిలో ఎవరు కూడా మ్యాచ్ విన్నర్ లేడు. ప్రస్తుతం ఇండియా కంటే పాకిస్థాన్ ఆట చాలా బాగా ఉంది. కాబట్టి ఈ నెలలో ప్రపంచ కప్ లో భాగంగా ఇండియాతో జరిగే మ్యాచ్ లో పాక్ విజయం సాధిస్తుంది అని రషీద్ లతీఫ్ అన్నారు.
ఇక రషీద్ లతీఫ్ మాటలను మన భారత అభిమానులు కూడా గట్టిగానే తిప్పి కొడుతున్నారు. ఓక్ వాళ్ళు ఎప్పుడు నోటికి వచ్చింది వాగుతారు అని రషీద్ లతీఫ్ మళ్ళీ నిరూపించాడు అంటున్నారు. నువ్వు చెప్పే వాటిలో నిజం ఉంటె.. గత ఏడాది ఇండియా జట్టులోకి కొత్తగా వచ్చిన 60 మంది కనీసం 50 మంది ఆటగాళ్ల పేర్లను చెప్పాలని అంటున్నారు.

Advertisement

Visitors Are Also Reading