Home » ధనవంతుణ్ణి కాదని మామూలు డైరెక్టర్ ను రాశి పెళ్లి చేసుకోవడానికి కారణం..!!

ధనవంతుణ్ణి కాదని మామూలు డైరెక్టర్ ను రాశి పెళ్లి చేసుకోవడానికి కారణం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

అలనాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలపాటు రాశి తన స్టార్ డం కొనసాగించింది. తన అందం అభినయంతో కుర్ర కారుకు చెమటలు పట్టించింది. స్టార్ హీరోలు సైతం రాశిని హీరోయిన్ గా పెట్టుకునేందుకు ఆసక్తి చూపేవారు. అలా కొంతకాలం పాటు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్గా మారింది రాశి . ప్రస్తుతం ఈ అమ్మడు అమ్మ, అత్త పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అంతేకాకుండా ఐటమ్ సాంగ్ లో కూడా నటించి అందరిని అబ్బురపరిచింది. అలాగే మహేష్ బాబు హీరోగా విలన్ గా నటించిన మూవీలో గోపీచంద్ కీప్ పాత్రలో నటించింది. అలాంటి రాశి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరలుగా మారింది.

Advertisement

Advertisement

రాశిని పెళ్లి చేసుకోవడానికి ముందుగా అత్యంత ధనవంతుడైన ఒక బిజినెస్ మాన్ వచ్చారట. కానీ రాశి ఆ సంబంధం రిజెక్ట్ చేసి మామూలు దర్శకుడిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈమె డైరెక్టర్ శ్రీనివాసుని ప్రేమ వివాహం చేసుకుంది. వీరిది ఎన్నో సంవత్సరాల ప్రేమ కాదు. కేవలం 15 రోజుల్లోనే ప్రేమలో పడి వివాహం చేసుకుంది. రాశి రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ఒక పెళ్ళాం ముద్దు.. ఇద్దరు పెళ్ళాలు వద్దు అనే చిత్రంలో నటిస్తున్న సమయంలో డైరెక్టర్ శ్రీనివాస్ కంటపడిందట.

అప్పటికి రాశి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. కానీ డైరెక్టర్ శ్రీనివాస్ ఒక మామూలు వ్యక్తి. సెట్లో రాశితో మాట్లాడానికి చాలా ప్రయత్నించే వారట. అలా మెల్లిమెల్లిగా ఆమెను షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడేశాడు. తన లవ్ గురించి చెప్పి 15 రోజుల్లోనే పెళ్లి చేసుకున్నాడు. తక్కువ సమయంలో ప్రేమలో పడిన వీరి జీవితం 17 సంవత్సరాలైనా ఎలాంటి విభేదాలు లేకుండా కొనసాగుతోంది.

also read:

Visitors Are Also Reading