Home » ఐఏఎస్ సేవ.. హీరోయిన్ సేవ ఒక్కటే అంటున్న రాశి ఖన్నా..!

ఐఏఎస్ సేవ.. హీరోయిన్ సేవ ఒక్కటే అంటున్న రాశి ఖన్నా..!

by Azhar
Ad
సినిమాల్లో రావడానికి చాలా మంది అమ్మాయిలు ట్రై చేస్తుంటారు. కానీ వారికీ అవకాశం అనేది దొరకదు. ఇక మరికొంత మంది అమ్మాయిలు వేరే ఏదో చేయాలనుకుంటు ఉంటె.. హీరోయిన్ గా అవకాశం రావడం.. దానిని వాళ్ళు ఒప్పుకోవడం ఆ తర్వాత స్టార్ హీరోయిన్ అయ్యిపోవడం అనేది జరుగుతుంది. అయితే మన తెలుగు హీరోయిన్ రాశి ఖన్నా కూడా అలాంటి లిస్ట్ లోకే వస్తుంది. తాను అసలు ఎమ్మో ఉహించుకున్నాను అంటున్న రాశి ఖన్నా.. జీవితం అనేది తనను సినిమాల్లోకి తీసుకువచ్చింది అని చెబుతుంది.
అయితే ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా.. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ వస్తుంది. ఇప్పుడు తాజాగా ఆమె హీరోయిన్ గా నటించిన పక్కా కమర్షియల్ అనే సినిమా విడుదలై జనల ముందుకు వచ్చింది. ఇందులో రాశి ఖన్నా.. హీరో గోపీచంద్ తో జత కట్టింది. అయితే లాయర్ పాత్రలో నటించిన రాశి ఖన్నా.. ఈ సినిమా ప్రమేషన్స్ లో మాట్లాడుతూ.. అసలు తాను హీరోయిన్ కావాలని.. అవుతానని ఎప్పుడు అనుకోలేదు అని చెప్పింది. నిజానికి తాను ఓ ఐఏఎస్ కావాలనుకున్నట్లు పేర్కొంది.
నేను చిన్నపాటి నుండి ఓ ఐఏఎస్ కావాలని చాలా అనుకున్నాను. ఆ దారిలోనే నా ప్రయాణం కొనసాగిస్తున్నాను. కానీ జీవితం నన్ను ఇలా ఈ సినిమాల్లోకి తీసుకువచ్చింది. అయితే ఏ బ్యాగ్రౌండ్ అనేది లేకుండా సినిమాల్లో నేను ఇలా రాణిస్తున్నాను అంటే అదంతా ఆ దేవుని దయ కారణంగానే అని చెప్పింది. ఇక అదే విధంగా చిన్నపుడు ఐఏఎస్ అయ్యి ప్రజలకు సేవ చేయాలి అనుకున్న నేను.. ఇప్పుడు హీరోయిన్ అయ్యి వారికీ సేవ చేస్తున్నాను. అయిన నా దృష్టిలో ఈ రెండు సమానమే అని రాశి ఖన్నా పేర్కొంది.

Advertisement

Visitors Are Also Reading