Telugu News » కేర‌ళ‌లో బ‌న్నీ హ‌వా….ఉత్స‌వంలోనూ రారా సామీ పాట‌కు బ్యాండ్..!

కేర‌ళ‌లో బ‌న్నీ హ‌వా….ఉత్స‌వంలోనూ రారా సామీ పాట‌కు బ్యాండ్..!

by AJAY MADDIBOINA

అల్లు అర్జున్ హీరోగా న‌టించిన తాజా చిత్రం పుష్ప‌. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప‌రాజ్ గా క‌నిపించారు. గంద‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాతో సుకుమార్ బ‌న్నీ కాంబోలో హాట్రిక్ న‌మోద‌య్యింది.

Ads
pushpa

pushpa

ఈ చిత్రంలోని పాట‌లు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబో వ‌చ్చిన ఆర్య‌, ఆర్య 2 సినిమాల‌కు దేవీ శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చగా పుష్ప సినిమాకు కూడా దేవీ శ్రీనే స్వ‌రాలు స‌మ‌కూర్చారు. ఇక ఈ చిత్రంలోని రారా సామీ, ఊ అంటావా మామా ఊఊ అంటావా పాట‌కు భారీ రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా తాజాగా రారా సామీ పాట కేర‌ళ‌లో కూడా వైర‌ల్ అవ్వ‌డం విశేషం.

ఈ పాట‌కు ఏకంగా ఉత్స‌వంలో వాయిద్యాలు వాయిస్తూ దేవుడిని ఊరేగిస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా వాయిద్యాలు వాయిస్తూ ఉండ‌టం తో ప‌క్క‌న ఉన్న‌వాళ్లు కూడా అంతే ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నారు. మ‌రో వైపు రీసెంట్ గా ఇదే పాట‌ను సంక్రాంతి సంద‌ర్భంగా ఓ గంగిరెద్దుల వ్య‌క్తి కూడా త‌న వాయిద్యంతో పాడుతూ అల‌రించాడు. ఇదిలా ఉంటే పుష్ప సినిమాలోని ఊ అంటావా మామా పాట సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యింది. ఇన్స్టా గ్రామ్ రీల్స్ లో ఈ విడియోకు తెలుగు తో పాటూ ఇత‌ర భాష‌ల్లోనూ అమ్మాయిలు స్టెప్పులు వేస్తున్నారు.

Watch Here -> Video 

ALSO READ : Rowdy Boys: రౌడీ బాయ్స్ లో ఈ సీన్ గ‌మ‌నించారా..? మ‌క్కీ టూ మ‌క్కీ ఆ సినిమా నుండి దింపేశాడుగా..!


You may also like