జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికలలో జనసేన ని పవన్ కళ్యాణ్ రాపాక వరప్రసాద్ కు టికెట్ ఇచ్చి గెలిపించారు. రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ జనసేన ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
Advertisement
వైసిపి కార్యకర్తలు సహాయంతోనే రాపాక విజయం సాధించారని ఇప్పటికి ఆ నియోజకవర్గంలో ప్రచారం సాగుతూనే ఉంది. అంతేకాదు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు వైసీపీ మద్దతుదారుడి గానే రాపాక వరప్రసాద్ కొనసాగుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఏ బిల్లు తీసుకువచ్చిన, ఏ నిర్ణయం తీసుకున్న దానికి వత్తాసు పలుకుతున్నారు రాపాక వరప్రసాద్. ఈ తరుణంలోనే మరో సంచలనానికి తెర లేపారు రాపాక వరప్రసాద్.
Advertisement
జూన్ 7వ తేదీన రాపాక వరప్రసాద్ కుమార్ రెడ్డి వివాహం ఉంది. ఈ తరుణంలోనే.. చాలా తెలివిగా పెళ్లి కార్డులను ముద్రించాడు రాపాక వరప్రసాద్. ఎవరు చేయని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతుల ఫోటోలను పెళ్లి కార్డులపై ముద్రించి…. తాడేపల్లిగూడెం ప్యాలెస్ కు పంపాడు. కచ్చితంగా జగన్ దంపతులు తమ కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఈ సందర్భంగా పేర్కొన్నాడు రాపాక వరప్రసాద్. ప్రస్తుతం ఈ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
భీమ్లా నాయక్ సినిమాకు జగన్ వల్ల రూ. 30 కోట్లు నష్టం వచ్చిందా ?
Advertisement
Virupaksha : నల్ల కోడి ఎత్తుకుపోయేది క్షుద్ర పూజలకేనని ముందే హింట్ ఇచ్చిన దర్శకుడు