Home » శ్రీ‌లంక నూత‌న ప్ర‌ధానిగా ర‌ణిల్ విక్ర‌మ సింఘే ప్ర‌మాణ‌స్వీకారం

శ్రీ‌లంక నూత‌న ప్ర‌ధానిగా ర‌ణిల్ విక్ర‌మ సింఘే ప్ర‌మాణ‌స్వీకారం

by Anji
Published: Last Updated on

శ్రీ‌లంక నూత‌న ప్రధానిగా ర‌నీల్ విక్ర‌మ‌సింఘే బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అధ్య‌క్షుడు గోట‌బ‌య రాజ‌ప‌క్సే ర‌ణిల్ విక్ర‌మ‌సింఘే చేత ప్ర‌మాణ స్వీకారం చేయించి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇప్ప‌టికే శ్రీ‌లంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతుండ‌డంతో.. విష‌మ ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌ప‌డేసే బాధ్య‌త ప్ర‌స్తుతం ర‌ణిల్ విక్ర‌మ‌సింఘేపై ఉంది. ఇటీవ‌ల శ్రీ‌లంక‌లో నిర‌స‌న‌లు తీవ్ర‌మై హింసాత్మ‌కంగా మారాయి. దీంతో ప్రధాని ప‌ద‌వీలో ఉన్న మ‌హిందా రాజ‌ప‌క్సే త‌న ప‌ద‌వీకి రాజీనామా చేశారు.

దీంతో నూత‌న ప్ర‌ధాని ఏర్పాటు కచ్చిత‌మైంది. బుధ‌వారం దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశిస్తూ మాట్లాడిన అధ్య‌క్షుడు గోట‌బ‌య రాజ‌ప‌క్సే వారం రోజుల్లో ప్ర‌ధాని కొత్త మంత్రి వ‌ర్గాన్ని ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చాడు. ఈ నేప‌థ్యంలో యునైటేడ్ నేష‌న‌ల్ పార్టీ చీఫ్‌గా ఉన్న ర‌ణిల్ విక్ర‌మ సింఘే ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 73 ఏళ్ల ర‌ణిల్ 1993 నుండి 5 సార్లు శ్రీ‌లంక‌కు ప్ర‌ధానిగా ప‌ని చేసిన అనుభ‌వం ఉంది. ఈ అనుభ‌వంతో శ్రీ‌లంక ఆర్థిక ప‌రిస్థితుల‌ను మార్చుతాడ‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. కొత్త‌గా ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు తీసుకున్న విక్ర‌మ‌సింఘేకు మాజీ ప్ర‌ధాని మ‌హేందా రాజ‌ప‌క్సే శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఇవాళ శ్రీ‌లంకలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. గ‌తంలో అఖిల‌ప‌క్ష ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని అధ్య‌క్షుడు గోట‌బ‌య రాజ‌ప‌క్సే సూచించిన ఆ స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత స‌ర్జిత్ ప్రేమ‌దాస ప‌ట్టించుకోలేదు. తాజాగా స‌ర్జిల్ ప్రేమ‌దాస కూడా ప్ర‌ధాని ప‌ద‌వీని స్వీక‌రించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ మాజీ అధ్య‌క్షుడు ప్ర‌స్తుత అధ్య‌క్షునికి బ‌హిరంగంగా లేఖ రాసాడు. అధ్య‌క్షుడు త‌న‌ను ముందు ఆహ్వానించిన క్ర‌మంలోనే ఈ లేఖ రాసిన‌ట్టు తెలిపారు. రాజ్యాంగంలోని 19వ ఆర్టిక‌ల్ తీసుకొస్తాన‌ని అధ్య‌క్షుడికి క్రూర‌మైన అధికారాలు ఇచ్చే ఆర్టిక‌ల్ 20ని ర‌ద్దు చేయాల‌ని ప్రేమ‌దాస డిమాండ్ చేశారు.

Also Read : 

ఆ బిగ్ బాస్ బామ‌తో నాగార్జున ఏం చేస్తాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

సీఎం జగన్ వల్లే “సర్కారు వారి పాట” అలా అయ్యిందంటూ మండి పడుతున్న ఫ్యాన్స్…!

 

Visitors Are Also Reading