దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా ఇద్దరూ కలిసి నటించిన వెబ్ సీరీస్ ‘రానా నాయుడు’. మార్చి 10 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ క్రైమ్ డ్రామా సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ ‘రే డోనావన్’ కి రీమేక్ గా తెరకెక్కినటువంటి ఈ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read : అల్లు ఫ్యామిలీతో గొడవలు…ఒక్క ఫోటోతో ఫుల్ క్లారిటీ ఇచ్చిన చిరంజీవి..!
Advertisement
ముఖ్యంగా విచ్ఛలవిడిగా అ*ల సన్నివేశాలు, అసభ్య పదజాలం కారణంగా తీవ్రమైన నెగెటివిటీ వచ్చింది. ఇప్పటివరకు ఫ్యామిలీ హీరోలుగా మాత్రమే తెలిసిన వెంకటేష్ నోటి నుంచి యథేచ్ఛగా *తులు రావడం చాలా మంది అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు రానాపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో రానా నాయుడు సిరీస్ మేకర్స్ విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. ఈ ట్రోలింగ్స్ తో సంబంధం లేకుండా టాప్ ట్రెండింగ్ లిస్ట్ ఉంది ఈ సిరీస్. ఈ తరుణంలోనే రానా నాయుడు సిరీస్ కి సంబంధించిన తెలుగు వెర్షన్ తొలగించింది నెట్ ఫ్లిక్స్.
Advertisement
Also Read : Dasara Review:దసరా మూవీ రివ్యూ.. నాని నటన మామూలుగా లేదే..!!
అసలు ఇది పొరపాటున జరిగిందా ? లేదా ట్రోల్స్ కారణంగా తొలగించారా అనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ఈ విషయంపై ఓటీటీ ప్లాట్ ఫామ్ వివరణ ఇవ్వాల్సి ఉంది. రానా నాయుడు సిరీస్ కి కరణ్, అన్షుమాన్, సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ లో సుచిత్ర పిళ్లై, గౌరవ్ చోప్రా, సుర్వీన్ చావ్లా, ఆశిష్ విద్యార్థి, అభిషేక్ బెనర్జీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. మొత్తం 8 ఎపిసోడ్లలో ఈ సిరీస్ తెరకెక్కింది. దీనికి ఏకంగా వెంకటేష్ రూ.12కోట్లు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. అదేవిధంగా రానా రూ.8కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడట. మరోవైపు దీనికి సీక్వెల్ కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది.
Also Read : రాజమౌళి సినిమా పోస్టర్ల పై ఈ స్టాంప్ ఎందుకు వేసుకుంటారు..? దాని వెనక ఉన్న స్టోరీ ఇదే..?