Telugu News » Blog » దేవుడు లాంటి కృష్ణ గారితో తనకు సంబంధం అంటగట్టారు.. రమ్య రఘుపతి సంచలనం

దేవుడు లాంటి కృష్ణ గారితో తనకు సంబంధం అంటగట్టారు.. రమ్య రఘుపతి సంచలనం

by Bunty
Published: Last Updated on
Ads

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు నరేష్-పవిత్ర లోకేష్ ల రిలేషన్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నట్టు డిసెంబర్ 31వ తేదీన అఫీషియల్ గా ప్రకటించారు. అంతేకాదు ఇద్దరూ ముద్దు పెట్టుకుని కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామంటూ రిలీజ్ చేసిన వీడియో వైరల్ అయింది. దీనిపై ఇంటర్నెట్ లో అనేక చర్చలు నడిచాయి. అయితే తాజాగా నరేష్-పవిత్రల పెళ్లి జరగనివ్వనంటూ రమ్య రఘుపతి ఫైర్ అయ్యింది.

Advertisement

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రమ్య రఘుపతి, నరేష్ వ్యక్తిత్వానికి సంబంధించిన పలు విషయాలతో పాటు నరేష్-పవిత్రల పెళ్లి, ముద్దు పెట్టుకునే వీడియోలపై ఘాటుగా రియాక్ట్ అయింది. ఇలాంటివన్నీ చూస్తూ ఏ భార్య అయితే తట్టుకోగలదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రమ్య రఘుపతి, మా ఇద్దరికీ విడాకులు అయిపోయాయి అని ప్రచారం జరుగుతోంది. కానీ అందులో నిజం లేదని చెప్పింది. తమ విడాకుల ప్రక్రియ కోర్ట్ లో కొనసాగుతుందని తెలిపింది.

Advertisement

నన్ను వదిలించుకోవడానికి నరేష్ దారుణాతి దారుణాలు చేశాడని చెప్పిన రమ్య రఘుపతి, ఏది ఏమైనా సరే, నరేష్ కి మాత్రం విడాకులు ఇవ్వడం జరగదని చెప్పడం గమనార్హం. పవిత్రను తొలిసారి కలిసినప్పుడు తన చేతితోనే అన్నం పెట్టానని చెప్పిన రమ్య, ఇప్పుడు ఆవిడ అన్నం పెట్టిన చేతికే సున్నం రాస్తుందని చెబుతూ ఆవేదన చెందింది. ఏది ఏమైనా నరేష్-పవిత్రల పెళ్లి మాత్రం జరగనివ్వను అని తేల్చి చెబుతోంది రమ్య రఘుపతి. అలాగే నరేష్ కి విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని కూడా అంటోంది. అంతేకాదు చివరకు దేవుడు లాంటి కృష్ణ గారితో తనకు సంబంధం అంటగట్టాడని వాపోయింది. దీంతో ఈ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ అయింది.

Advertisement

read also : Veera Simha Reddy Trailer : ‘వీర సింహారెడ్డి’ ట్రైలర్ రిలీజ్.. జగన్ ప్రభుత్వంపై బాలయ్య పంచ్ లు ?