Home » అన్ స్టాపబుల్ మూడో ఎపిసోడ్ వచ్చేది ఎవరు..?

అన్ స్టాపబుల్ మూడో ఎపిసోడ్ వచ్చేది ఎవరు..?

by Azhar
Ad
నందమూరి నటసింహం బాలకృష్ణ మొదట ఓటీటీలో ఓ షో హోస్ట్ చేస్తున్నారు అనగానే అందరూ షాక్ అయ్యారు. కానీ ఆయన హోస్ట్ గా ఆహలో వచ్చిన అన్ స్టాపబుల్ అనే కార్యక్రమం సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ అన్ స్టాపబుల్ మొదటి సీజన్ అనేది ముగించుకొని.. ఈ మధ్యే మళ్ళీ రెండో సీజన్ అనేది ఆరంభం అయ్యింది. ఇక ఈ సెకండ్ సీజన్ ను ఘనంగా మాజీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబుతో ప్రారంభించారు.
ఇక రెండో ఎపిసోడ్ లో అయితే.. టాలీవుడ్ యువ హీరోలు అయిన విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ వచ్చారు. వీరి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కూడా ఇప్పటికే విడుదల అయ్యింది. ఈ సమయంలో ఈ అన్ స్టాపబుల్ యొక్క మూడో ఎపిసోడ్ లో ఎవరు రాబోతున్నారు అనే ఉత్సహం అనేది ఫ్యాన్స్ లో బాగా పెరిగిపోయింది.
అయితే తాజాగా అన్ స్టాపబుల్ కు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనే వార్తలు వచ్చిన తరుణంలో.. మూడో ఎపిసోడ్ లో ఆయనే రాబోతున్నాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ఇప్పుడు రావడం లేదట. అన్ స్టాపబుల్ మూడో ఎపిసోడ్ కి.. శివగామిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచుకున్న రమ్యకృష్ణ వస్తుంది అని తెలుస్తుంది. అలాగే ఆమె భర్త అయిన దర్శకుడు కృష్ణ వంశీ కూడా రాబోతున్నాడు అనే టాక్ ఉష మీడియాలో నడుస్తుంది.

Advertisement

Visitors Are Also Reading