Home » ఒంటి చేత్తో రైల్ ఇంజను ఆపిన ఈ ఘనుడి గురించి మీకు తెలుసా?

ఒంటి చేత్తో రైల్ ఇంజను ఆపిన ఈ ఘనుడి గురించి మీకు తెలుసా?

by Azhar
Ad

క‌లియుగ భీముడిగా, ఇండియ‌న్ హెర్క్యులెస్ గా పేరుగాంచిన కోడి రామ్మూర్తి నాయుడు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు. ఈయ‌న సాహ‌సాలు అనన్య‌సామాన్యం. గట్టిగా ఊపిరి పీల్చుకుని కండలు బిగించి, తన ఛాతీ చుట్టూ చుట్ట‌బ‌డిన ఇనుప‌ తాళ్ళను తెంచేవారు. ఛాతీ మీదకు ఏనుగును ఎక్కించుకుని 5 నిముషాల పాటు నిలిపేవారు. రెండు కార్లకు తాళ్ళని క‌ట్టి ఆ తాళ్ల‌ను రెండు చేతులుతో పట్టుకుని కదలకుండా ఆపేవారు. ఒంటి చేత్తో రైల్ ఇంజను ఆపిన ఘనుడు.

Advertisement

Advertisement

ఈయ‌న గురించి విన్న అప్పటి వైస్రాయి లార్డ్ మింటో రామ్మూర్తి నాయుడిని స్వ‌యంగా ప‌రీక్షించాల‌నుకొని త‌న కార్ ను తాళ్ల‌తో క‌ట్టి ఆ తాడును నాయుడి చేతికిచ్చి…త‌న కార్ ఇంజిన్ ఆన్ చేసి ఎంత‌గా రేజ్ ఇచ్చినా కార్ ఇంచు కూడా క‌ద‌ల్లేదు. ఆనాటి ఇంగ్లండు పాలకులైన కింగ్ జార్జ్, క్వీన్ మేరీలు రామ్మూర్తి నాయుడి బల ప్రదర్శనకు అబ్బురపడి, ‘ఇండియన్ హెర్క్యులెస్’ అనే బిరుదునిచ్చారు.

బుల్ ఫైట్ లో ఎలాంటి అనుభ‌వంలేని నాయుడు స్పెయిన్ లోని బుల్ ఫైట్ లో పాల్గొని దూసుకొస్తున్న కోడె కొమ్ములను వంచి నేల‌కూల్చాడు. ఇలా దేశ ఖ్యాతిని ప్ర‌పంచ న‌లుమూల‌లా చాటాడు.

Visitors Are Also Reading