Home » రమేష్ బాబు కూతురు గురించి నమ్రత ఏమంటుందంటే.. చూస్తే ఎమోషనల్ అవుతారు..!!

రమేష్ బాబు కూతురు గురించి నమ్రత ఏమంటుందంటే.. చూస్తే ఎమోషనల్ అవుతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీ అంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉన్నది.. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఈ ఫ్యామిలీని తారాస్థాయికి తీసుకెళ్లి ఉంచారని చెప్పవచ్చు. అలాంటి సూపర్ స్టార్ కృష్ణ ఈ మధ్య కాలంలోనే ఇండస్ట్రీని కుటుంబాన్ని వదిలి వెళ్లారని చెప్పడం బాధాకరం.. ఆయన మరణాన్ని మహేష్ బాబు తట్టుకోలేకపోతున్నారు. ఒక పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆయన బాధనుఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.

Advertisement

also read:తెలుగులో ఛాన్స్ కొటేషన్ “లవ్ టుడే” ముద్దుగుమ్మ.. హీరో ఎవరంటే..?

ఒకే ఏడాది అన్న రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి, తండ్రి కృష్ణ ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి దూరం అవడం మహేష్ బాబుని ఎంతగానో కలవరపెడుతోంది. ప్రస్తుతం రమేష్ బాబు కుటుంబ బాధ్యత కూడా మహేష్ బాబు పై పడ్డాయని చెప్పవచ్చు.. ఇక పోతే తన అన్న రమేష్ బాబు ఫ్యామిలీ గురించి బయట ఎక్కువ మందికి తెలియదు. కానీ కృష్ణ మరణంతో వీరు బయటకు వచ్చారు.. కెమెరా కంటికి చిక్కారు.. కృష్ణ గారి పెద్దకర్మ కార్యక్రమాలలో మహేష్ బాబుతో రమేష్ బాబు ఫ్యామిలీని చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారు.. రమేష్ బాబు కొడుకు జయ కృష్ణ, కూతురు భారతి మీడియా కంటికి చిక్కారు. అంతేకాకుండా మహేష్ బాబుతో కలిసి ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నాయి. జయకృష్ణ కటౌట్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

హీరోకు ఏమాత్రం తగ్గిదేలే అన్న విధంగా ఉన్నాడు.. ఈ తరుణంలోనే మహేష్ బాబు సతీమణి నమ్రత తన బావ కుమార్తె అయిన భారతితో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అంతేకాకుండా భారతి సీతారాల గురించి ఒక పోస్ట్ అందరినీ ఆకర్షిస్తుంది.. భారతి, సితార ఇద్దరమ్మాయిల వల్లే మా ఇంట్లో నవ్వులు వచ్చాయంటూ వారితో దిగిన సెల్ఫీని నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇది చూసిన నెటిజెన్లు హీరోయిన్ కు ఏ మాత్రం తగ్గని అందంతో భారతి ఉందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

also read:

Visitors Are Also Reading