మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగాపవర్ స్టార్ చరణ్ మెగా వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొంది వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా గడుపుతున్నారు. రామ్‌చరణ్ తన సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటించి తన భార్య ఉపాసనతో కలిసి వెకేషన్ వెళ్లినట్టు సమాచారం. రామ్‌చరణ్-ఉపాసన దంపతుల 10వ పెళ్లి రోజు దగ్గర పడడంతో వీరిద్దరూ పెళ్లిరోజు వేడుకను ఘనంగా జరుపుకునేందుకు ఇటలీ వెళ్లినట్టు సమాచారం.
Advertisement
ప్రస్తుతం ఇటలీ ట్రిప్‌నకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామ్‌చరణ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతున్నాడు. ఇక ఉపాసన ప్రముఖ వ్యాపారవేత్త కావడంతో ఆమె వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో జూన్ 14న వీరిద్దరూ మూడుముల్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ కోరికనే వీరి వివాహం జరిగి 10 సంవత్సరాలు కావడంతో ఈ అద్భుతమైన రోజులు ఘనంగా జరుపుకునేందుకు ఈ దంపతులు ఇటలీ వెళ్లారు.
Advertisement
ఇటలీ దేశంలో ఎంతో ప్రఖ్యాతి పొందిన నగరాల్లో ఒకటిగా పేరు గాంచిన మిలన్ నగరంలో ఈ జంట తమ పెళ్లి వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం రామ్‌చరణ్-ఉపాసన దంపతులు హాలీడే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి స్ఫూర్తిగా ఉన్నటువంటి రామ్‌చరణ్ దంపతులకు పిల్లలు లేరనే ఒకే ఒక అసంతృప్తి తప్ప వారి జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతోంది. గతంలోనే పిల్లల గురించి ఉపాసన దగ్గర ప్రస్తావించగా.. ఇప్పుడు తాను ఈ విషయం గురించి ఏ సమాధానం చెప్పిన పెద్ద సెన్సేషన్ అవుతుందని సమయం వచ్చినప్పుడు తానే సమాధానం చెబుతానని ఈ ప్రశ్నను దాటవేసారు.
Also Read :
నందమూరి బాలకృష్ణ తో హ్యాట్రిక్ కొట్టిన దర్శకులు వీరే..!
నయనతార తన పెళ్లికి ధరించిన చీర ధర ఎంతో తెలుసా..?