మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ హిట్ తరువాత దిగ్గజ దర్శకుడు శంకర్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్‌సీ-15 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ కాస్త లేటవుతుండడంతో అభిమానుల్లో కలవరం మొదలైంది. ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్‌చరణ్ పలు రకాలుగా దర్శనమిస్తున్నారు. అతనికి తోడు హీరోయిన్ అంజలి కూడా ఉన్నారు.
Also Read : Twins: నయన్-విగ్నేష్ తప్పు చేస్తే శిక్ష ఏమిటో తెలుసా..?
Advertisement
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను బట్టి ఈ స్టోరి గురించి రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి. కొన్ని ఫోటోల్లో రామ్‌చరణ్ ధోతి కట్టుకుని ఇంటి ముందు కూర్చుని ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో చాలా మంది మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషి సినిమా గుర్తుకు వస్తుందని అనుకుంటున్నారు. ఈ ఫోటోలో ఎస్‌వీసీ అని హ్యాష్ ట్యాగ్ ఉండడం.. మరో ఫోటోలో రామ్‌చరణ్, అంజలితో పాటు ఓ బాలుడు కూడా ఉన్నాడు. షూటింగ్ స్పాట్‌లోనే ఫోన్ పట్టుకుని హీరోయిన్ అంజలి కనిపించింది.
Advertisement
Also Read : మెగా హీరోలతో కానిది, నందమూరి హీరోలు చేస్తున్నారా..సెంటిమెంట్ ఏంటంటే..?
కొన్ని ఫోటోల్లో భారతీయుడు కమల్ హాసన్‌ని, రామ్‌చరణ్‌ని పక్క పక్కన పెట్టి పోల్చుతున్నారు. లీకైన ఫోటోలా లేదా ఎవరైనా అభిమానులు క్రియేట్ చేశారా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ అయినటువంటి శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. రామ్‌చరణ్-శంకర్ కాంబోలో వచ్చిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం రాజకీయ కోణంలో కొనసాగుతుందని తెలుస్తోంది. ఇందులో శ్రీకాంత్, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. కథ కార్తిక్ సుబ్బరాజు అందించారు.
Also Read : బాలయ్య షో లో బాబు చెప్పిన డైలాగ్‌లు వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!