Home » క్రేజీ అప్డేట్….స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్..!

క్రేజీ అప్డేట్….స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్..!

by AJAY
Ad

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వ‌రుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేయ‌గా ఈ సినిమా మార్చి 25న విడుద‌ల కానుంది. మ‌రోవైపు చ‌ర‌ణ్ త‌న త‌దుపరి సినిమాను శంక‌ర్ తో చేస్తున్నారు. ఈ సినిమాను కూడా భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా లెవ‌ల్ లో తెర‌కెక్కిస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా త‌ర‌వాత జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరితో చ‌ర‌ణ్ సినిమా చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గానే రామ్ చ‌ర‌ణ్ త‌న 16వ సినిమాను కూడా అనౌన్స్ చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు చెక్క‌ర్లు కొడుతున్నాయి. ప్ర‌ముఖ న‌టుడు స‌ముద్రఖ‌ని ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ కు ఓ క‌థ‌ను వినిపించ‌గా ఆ క‌థ చ‌ర‌ణ్ కు భాగా న‌చ్చేసింద‌ట‌. దాంతో రామ్ చ‌ర‌ణ్ ఆ సినిమా చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. స‌ముద్ర‌ఖ‌ని మంచి న‌టుడు మాత్ర‌మే కాకుండా మంచి ర‌చయిత కూడా.

Advertisement

ఇప్ప‌టికే స‌ముద్రఖ‌ని త‌మిళ్ లో వినోద‌య సితం అనే సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాను తెలుగు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా క‌థ‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ కు చెప్పి ఒప్పించిన‌ట్టు సమాచారం. ఇదిలా ఉండ‌గానే ఇప్పుడు స‌ముద్ర‌ఖ‌ని చ‌ర‌ణ్ ను కూడా ఒప్పించే ప‌నిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

Visitors Are Also Reading