మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలు అనేకమంది హీరో హీరోయిన్లు ఉన్నారు. హీరోలు ఇక్కడివారు అయినప్పటికీ… హీరోయిన్లు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు. అలా ఇక్కడ సెటిలై… రెండు మూడు సినిమాలు చేసి పాపులర్ అయిపోతారు. ఇక కొంతమంది… హీరోయిన్లు మాత్రం ఇప్పటికి చెరగని ముద్ర వేసుకుంటారు. టాలీవుడ్ ప్రేక్షకులకు నిత్యం గుర్తుండిపోతారు కొంతమంది హీరోయిన్లు. అలా గుర్తుండిపోయిన హీరోయిన్లలో దివ్యభారతి ఒకరు.
Advertisement
అలనాటి నటి దివ్యభారతి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ బ్యూటీ…. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలను అనేక సినిమాలు చేసింది. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోలతో బ్రహ్మాండమైన సినిమాలు చేసింది ఈ బ్యూటీ. టాలీవుడ్ చిత్రపరుశ్రమలో అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు మరియు ధర్మక్షేత్రం లాంటి సినిమాలలో నటించి తొందరగానే తెలుగులో పాపులర్ అయింది. అందం మరియు అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది దివ్యభారతి. అతి చిన్న వయసులోనే బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనూ రాణించి అందర్నీ మెప్పించింది.
Advertisement
అయితే.. ఈ బ్యూటీ కేవలం 19 సంవత్సరాల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఇది అందరినీ కలిచి వేసే అంశం. 1993 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన ప్రమాదవశాత్తు… ఆమె నివసిస్తున్న ఐదంతస్తుల భవనం పైనుంచి కింద పడి మరణించింది హీరోయిన్ దివ్యభారతి. దీంతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఆమె చనిపోయే సమయానికి తొలిముద్దు అనే సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇంకా ఆ సినిమాలో దివ్యభారతి కొన్ని సీన్స్ చేయాల్సి ఉంది. ఇక దివ్యభారతి చనిపోవడంతో… ఆమె స్థానంలో టాలీవుడ్ హీరోయిన్ రంభ ను డూప్ హీరోయిన్ గా తీసుకున్నారు. దీంతో ఆ సినిమా షూటింగ్ పూర్తయి… రిలీజ్ కూడా అయిపోయింది.
ఇవి కూడా చదవండి
Sri Reddy : “బోళా శంకర్” పరువు తీసిన శ్రీరెడ్డి.. చిరంజీవి సినిమాలన్ని రీమేక్ లే ?
రవిబాబు సినిమాల్లో పూర్ణ ఎక్కువగా నటిస్తుంది ఎందుకో తెలుసా…!
చనిపోయిన వారు మళ్లీ అదే కుటుంబంలో పుడతారు… ఎందుకంటే….?