నటి రంభ అందరికీ సుపరిచితమే. రంభ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రంభ చాలామంది హీరోలతో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
Advertisement
90 లలో స్టార్ హీరోయిన్ గా ఈమె చక్రం తిప్పింది. ప్రస్తుతం రంభ సినిమాలకు దూరంగా ఉంటోంది. ఈమె సౌత్ లో నార్త్ లో కూడా చాలా సినిమాలు చేసి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. మలయాళ, కన్నడ, భోజ్పురి, హిందీ వంటి భాషల్లో కూడా ఈమె సినిమాలు చేసింది. దివ్యభారతి చనిపోయిన తర్వాత రంభ అచ్చం దివ్యభారతి పోలికలతో ఉండడంతో ఆమె చనిపోయినప్పుడు ఆగిపోయిన మూవీస్ ని ఈమె తో చేశారు. ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో రంభ టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయమైంది.
Advertisement
తర్వాత ఈమెకి వరుసగా ఆఫర్లు వచ్చాయి. స్పెషల్ డాన్సులు కూడా ఈమె పలు సినిమాల్లో చేసింది. 2003లో రంభ స్వయంగా నిర్మాతగా వ్యవహరించింది. త్రీ రోజెస్ అనే సినిమాని ఈమె తెర మీదకి తీసుకువచ్చింది కానీ సినిమా డిజిస్టర్ రావడంతో ఆస్తులు అన్ని పోయాయి మళ్లీ డబ్బులు సంపాదించుకోవడానికి ఐటమ్ సాంగ్స్ చేయడం మొదలు పెట్టింది. 2010లో ఇంద్ర కుమార్ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. ఆ మధ్యకాలంలో భర్తకి విడాకులు ఇవ్వబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఆర్థిక సమస్యలు ఇందుకు కారణమని తెలుస్తోంది. కానీ రాఘవేంద్రరావు సహాయం చేసి వీళ్ళు కలిసి ఉండేలా చేశారట.
Also read:
- చంద్రబాబుని అక్రమ అరెస్టు చేసినవారికి పుట్టగతులు ఉండవు – అశ్విని దత్
- లావణ్య త్రిపాఠి కి రూ.3 కోట్లు నష్టం… వరుణ్ తేజ్ వల్లేనా..?
- త్రివిక్రమ్, సునీల్ పెళ్లిళ్ల వెనుక.. ఇంత పెద్ద రహస్యం ఉందా..? మీకూ తెలుసా..?