Home » రామారావు ఆన్ డ్యూటీ నుండి పోస్ట‌ర్…మాస్ లుక్ లో ర‌వితేజ‌..!

రామారావు ఆన్ డ్యూటీ నుండి పోస్ట‌ర్…మాస్ లుక్ లో ర‌వితేజ‌..!

by AJAY
Ad

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ్ క్రాక్ సినిమా విజ‌యంతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర‌వాత వ‌చ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిల‌వడంతో ర‌వితేజ వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం ర‌వితేజ ఖిలాడీ మ‌రియు రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాల‌లో న‌టిస్తున్నాడు. అయితే రవితేజ్ పుట్టిన రోజు సంధ‌ర్బంగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా నుండి ఓ పోస్ట‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

Advertisement

ramarao on duty

ramarao on duty

 

అంతే కాకుండా మార్చి 25న సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌కటించి మాస్ మ‌హ‌రాజ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చింది. స్టార్స్ ఆర్ బ‌ర్న్ బట్ స‌మ్ ఆర్ మేడ్ అంటూ ర‌వితేజ‌కు చిత్ర యూనిట్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పింది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు శ‌ర‌త్ ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈసినిమాలో ర‌జిషా విజ‌యన్ ర‌వితేజకు జోడీగా న‌టిస్తోంది. సామ్ సీఎస్ ఈ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. ఇక ఈ సినిమాలో ర‌వితేజ నిజాయితీ గ‌ల ఎమ్మార్వో పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Advertisement

Visitors Are Also Reading