Home » PM Modi : రామానుజాచార్యుల స‌మ‌తాసూత్రం రాజ్యాంగానికి స్ఫూర్తి

PM Modi : రామానుజాచార్యుల స‌మ‌తాసూత్రం రాజ్యాంగానికి స్ఫూర్తి

by Anji
Ad

రామానుజాచార్యుల విగ్ర‌హం జ్ఞానం, ధ్యానానికి ప్ర‌తీక అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కొనియాడారు. దేశ సంస్కృతిని మ‌రింత బ‌లోపేతం చేస్తుంద‌ని తెలిపారు. స‌మాజంలోని అంద‌రికీ స‌మాన అవ‌కాశాలు ద‌క్కాల‌ని ప్ర‌ధాని ఆకాంక్షించారు. హైద‌రాబాద్ న‌గ‌ర శివారు ప్రాంతంలోని ముచ్చింత‌ల్ చిన్న‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలోని శ్రీ‌రామ‌న‌గ‌రంలో స‌మ‌తామూర్తి శ్రీ‌రామానుజాచార్యుల భారీ విగ్ర‌హాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆవిష్క‌రించారు. అనంత‌రం మీడియాతో ముచ్చ‌టించారు. అందరూ సమానంగా అభివృద్ధి చెందాలంటే ఐక్యమత్యంతో సాగాలన్నారు. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఉజ్వల్‌ పథకం, జన్‌ధన్‌, స్వచ్ఛ్‌ భారత్‌ వంటి పథకాలన్నీ అందులో భాగమేనని వెల్ల‌డించారు.

Advertisement

రామానుజాచార్య విశిష్టాద్వైత కర్త అని కొనియాడారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన బోధనల్లో ఒకవైపు జ్ఞాన సముపార్జనకు మార్గాలున్నాయనీ.. మరోవైపు భక్తి మార్గాన్ని ఎలా అనుసరించాలో తెలిపారనీ చెప్పారు. సన్యాసాన్ని స్వీకరించి సిద్ధి పొందడానికి ఒక పరంపరను సృష్టించిన మహానుభావుడు రామానుజాచార్యుడు అని ప్రధాని అన్నారు. సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం మహాత్భాగ్యంగా భావిస్తున్నట్టు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మూర్తి.. భావితరాలకు ప్రేరణ మాత్రమే కాదన్నారు. భాతీయ ప్రాచీన మూలాలను బలపర్చేందుకు కూడా దోహదం చేస్తుందనే పూర్తి విశ్వాసం తనకుందన్నారు.

Advertisement

 Also Read : Today rasi phalalu in telugu : ఆ రాశివారికి ఉద్యోగ‌బ‌లం పెరుగుతుంది

ముఖ్యంగా రామానుజాచార్యులు దేశ ఐక్య‌త‌కు స్పూర్తి అని, స్వాతంత్య్ర పోరాటం కేవ‌లం దేశ ప్ర‌జలధికారం కోసమే కాదు. తెలుగు సంస్కృతిదేశ భిన్న‌త్వాన్ని బ‌లోపేతం చేస్తోంది. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు తెలుగు సంస్కృతిని పోషించారు. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. పోచంపల్లికి ప్రంచ వారసత్వ గ్రామంగా ఘనత దక్కింది. తెలుగు సినిమా విశ్వవ్యాప్తమైందని మోడీ పేర్కొన్నారు.

statue of unity

మ‌నిషి జీవితంలో గురువు అత్యంత కీలకమన్న ప్రధాని.. గురువే ధ్యాన కేంద్రమన్నారు. 108 దివ్య దేశ మందిరాలను ఇక్కడ చూసాను. దేశమంతా తిరిగి దేవాలయాలను చూసిన అనుభూతి కలిగిందని పేర్కొన్నారు. సమాజంలో అంతరాలను రామానుజాచార్య వెయ్యేళ్ల క్రితమే తొలగించారన్నారు. అందరినీ సమానంగా చూసారని, అనాడే ఆయన ఆదర్శాలు దేశవ్యాప్తంగా విస్తరించాయన్నారు. రామానుజాచార్యులు దళితులను ఆలయ ప్రవేశం చేయించారు. మనిషికి జాతి కాదు.. గుణం ముఖ్యమని లోకానికి చాటారు. రామానుజాచార్యుల సమతాసూత్రం.. మన రాజ్యాంగానికి స్ఫూర్తి అని కొనియాడారు.

Also Read :  న‌టి శ్రీసుధ కేసులో శ్యామ్ కే నాయుడుకు ఊర‌ట‌…!

Visitors Are Also Reading