Home » ఆ మ్యాజికల్ డైరెక్టర్ తో రామ్ సినిమా..?

ఆ మ్యాజికల్ డైరెక్టర్ తో రామ్ సినిమా..?

by Azhar

టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న హీరో రామ్ పోతినేని. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాలో చేసిన తర్వాత ఉస్తాద్ రామ్ గా మారిపోయాడు. ఇక ఆ సినిమా తర్వాత రామ్ ఇప్పటివరకు రెండు సినిమాలు చేసాడు కానీ అవి పెద్దగా అభిమానులను ఆకట్టుకోలేదు. అందులో ఒక్కటి రెడ్ సినిమా కాగా.. మరొకటి ది వారియర్.

తమిళ డైరెక్టర్ తో తెలుగు, తమిళ భాషల్లో చేసిన ఈ ది వారియర్ సినిమా ఈ మధ్యే వచ్చి ప్లాప్ అయ్యింది. కానీ దానిని పెద్దగా పట్టించుకోని రామ్ ప్రస్తుతం టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గా నిలిచినా బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అనేది ఇంకా ప్రారంభం కాకముందే రామ్ తర్వాతి సినిమా ఎవరితో అనే క్లారిటీ వచ్చింది.

బోయపాటి తర్వాత రామ్ లవ్ మ్యాజికల్ డైరెక్టర్ గా పేరు అనేది తెచ్చుకున్నా తమిళ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తో సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని గౌతమ్ మీనన్ స్వయంగా ప్రకటించాడు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్ లో గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. తన తర్వాతి సినిమా రామ్ తో అని చెప్పాడు. ఈ సినిమా కూడా తన గత సినిమాల విధంగానే ఓ మ్యాజికల్ లవ్ స్టోరీ అని కూడా చెప్పాడు. అయితే మాస్ హీరోగా మారుతున్న రామ్ ఈ లవ్ స్టోరీలో ఎలా చేస్తాడు అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

కోహ్లీకి రిటైర్ సలహా ఇస్తున్న మరి పాక్ క్రికెటర్..!

గంగూలీ పదవికి జై షా ఎసరు..?

Visitors Are Also Reading