టాలీవుడ్ లో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో ‘వ్యూహం’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు వర్మ. ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన టీజర్ సృష్టించిన దుమారం గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. తాజాగా వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “వ్యూహం” మూవీలో ఎవరున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, హోలీ ఉన్న నటులు ఉన్న ఫోటో పోస్ట్ చేశాడు వర్మ. ఈ టీజర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కూడా టార్గెట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు ఈ పోస్టు ద్వారా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
Advertisement
ముఖ్యంగా 2009 నుంచి 2014 నాటి రాజకీయ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ చిరంజీవిలను ఏ అంశం మీద టార్గెట్ చేశాడనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఇవంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం ప్రధానంగా రూపొందించిన ఈ సినిమా టీజర్ లో చంద్రబాబును నెగిటివ్ ప్రోజెక్టు చేశాడు వర్మ. ఇప్పుడు ఆర్జీవి పోస్ట్ చేసిన ఫోటో ద్వారా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం, పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావం వంటి అంశాలతో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసే అవకాశం ఉందని ఊహగానాలు వినిపిస్తున్నాయి.
Advertisement
ఒకప్పుడు ఇండియన్ సినిమా మేకింగ్ లో ఒక విప్లవం తీసుకొచ్చిన రామ్ గోపాల్ వర్మ లాంటిదిగ్గజ దర్శకుడు ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ మౌత్ పీస్ లాగా మారడం శోచనీయం. 2019 ఎన్నికల సమయంలో కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమాతో పొలిటికల్ క్యాంపెయిన్ చేసిన వర్మ.. ఇప్పుడు 2024 ఎన్నికల టార్గెట్ గా “వ్యూహం” రచిస్తున్నాడు. ఇది వాస్తవమో కాదో తెలియని.. ప్రచారంలో ఉన్న కథనాల ఆధారంగా సినిమా చేసి పొలిటికల్ మైలేజ్ పొందాలని చూస్తున్న వర్మకి ప్రతిసారి వర్కౌట్ అవుతుంది అనుకుంటే పొరపాటు అనే చెప్పాలి. వ్యూహం సినిమా విడుదలకు ముందే ఇన్ని ప్రకంపనలు రేపుతోంది. ఇక ముందు ముందు ఇంకెన్ని వివాదాలకు కేంద్ర బిందువు అవుతుందో వేచి చూడాలి మరి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఇండస్ట్రీలో కింగ్ లా బ్రతికి అనాధల చనిపోయిన స్టార్స్ వీరే..!
విజయ్ దేవరకొండ-రష్మిక ఎంగేజ్మెంట్.. వివాహం ఎప్పుడంటే..?