Home » ‘ఒక ప‌థ‌కం ప్ర‌కారం’ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన రామ్‌గోపాల్ వ‌ర్మ

‘ఒక ప‌థ‌కం ప్ర‌కారం’ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన రామ్‌గోపాల్ వ‌ర్మ

by Anji
Published: Last Updated on
Ad

పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా, అశీమా నర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ఒక పథకం ప్రకారం. వినోద్ విజయం ఫిలిమ్స్, విహారి సినిమా హౌస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను జాతీయ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నారు. విభిన్న కథాంశాలతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో రామ, రావణ తరహా పాత్రలో సాయిరాం శంకర్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరించారు.

'ఒక పథకం ప్రకారం' పోస్టర్ విడుదల చేసిన వర్మ!

Advertisement

Advertisement

ముఖ్యంగా ఈ సినిమా యొక్క కాన్సెప్టును పోస్టర్ పైన చూపించారు. ఈ సినిమాపై సహజంగానే ఆసక్తి కలుగుతోంది. డైరెక్టర్ వినోద్ విజయ్ తో పాటు ఎడిటర్, మేకప్ ఆర్టిస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ తో స‌హా మ‌రొక ఇద్ద‌రు జాతీయ అవార్డు గ్ర‌హీత‌లు. ఒక ప‌థ‌కం ప్ర‌కారం సినిమా కోసం ప‌ని చేస్తున్నార‌ని నిర్మాత‌లు ర‌వి ప‌చ్చ ముత్తు, గార్ల‌పాటి ర‌మేష్‌, వి.విజ‌య‌న్ తెలిపారు. గోపిసుంద‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శృతి సోధి, స‌ముద్ర ఖ‌ని, ర‌వి ప‌చ్చ‌ముత్తు, క‌ళాభ‌వ‌న్ మ‌ణి, భాను శ్రీ‌, ప‌ల్ల‌విగౌడ త‌దిత‌రులు కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు.

Visitors Are Also Reading