Home » 2024 ఎన్నికల బరిలో రామ్ గోపాల్ వర్మ.. వైసీపీ నుంచి పోటీ చేయనున్నాడా ?

2024 ఎన్నికల బరిలో రామ్ గోపాల్ వర్మ.. వైసీపీ నుంచి పోటీ చేయనున్నాడా ?

by Anji
Ad

టాలీవుడ్ సంచలన దర్శకుడు, సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అది రామ్ గోపాల్ వర్మ అనే చెప్పాలి. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తలలో నిలుస్తుంటాడు వర్మ. అదేవిధంగా అమ్మాయిలతో కూడా పార్టీలను చేసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటాడు. ఒకప్పుడు అగ్ర దర్శకుడిగా కొనసాగిన రామ్ గోపాల్ వర్మ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించాడు. ఇటీవలే పొలిటికల్ విషయాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు వర్మ. వైసీపీ తరుపున మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. 

Advertisement

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున వర్మ పోటీ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కొంత కాలం నుంచి ఆర్జీవీ వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. గతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా ఓ సినిమాను కూడా తీశాడు. అదేవిధంగా లక్ష్మీపార్వతికి అనుకూలంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాను తెరకెక్కించాడు. అదేవిధంగా టీడీపీ నేతలకు వ్యతిరేకంగా, వైసీపీకి అనుకూలంగా ట్వీట్స్ చేస్తుంటాడు. ఇటీవలే విజయవాడలో ఎన్టీఆర్ జయంతి వేడుక కార్యక్రమంలో ఎన్టీఆర్ ఖ్యాతి గురించి మాట్లాడాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ కి నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ హాట్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు.. టీడీపీ పై ఆ పార్టీ నాయకులపై పరోక్షంగా  కామెంట్స్ కూడా చేస్తుంటాడు. 

Advertisement

అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్ప పరిపాలకుడు అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలా నిత్యం వైసీపీ తరపున మాట్లాడుతాడు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ గురించి వార్త చక్కర్లు కొడుతోంది. 2024 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ తరుపున పోటీ చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

మరికొన్ని ముఖ్య వార్తలు : 

శివరామరాజు సినిమాలో ‘చెల్లి’గా నటించిన బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?

అమ‌ల ఏ దేశానికి చెందిన మ‌హిళ‌నో తెలుసా..ఆమె త‌ల్లి ఎవ‌రంటే…!

Visitors Are Also Reading