Home » సైకిల్ పై రామ్ చ‌ర‌ణ్‌ స‌రికొత్త లుక్‌.. ఫోటో వైర‌ల్‌..!

సైకిల్ పై రామ్ చ‌ర‌ణ్‌ స‌రికొత్త లుక్‌.. ఫోటో వైర‌ల్‌..!

by Anji

రామ్ చ‌ర‌ణ్‌కు 2022 తో పాటు శుభ‌కృత నామ సంవ‌త్స‌రం బాగానే క‌లిసొచ్చింద‌నే చెప్పాలి. ఈ ఏడాది రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ తోడుగా చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో సంచ‌ల‌న విజ‌యం అందుకుని పుల్ ఖుషిలో ఉన్నారు. అదే ఊపులో ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్‌లు ప‌లు చిత్రాల‌ను చేస్తున్నారు. తాజాగా రామ్‌చ‌ర‌ణ్ పంచ‌క‌ట్టుతో సైకిల్‌పై వెళ్తున్న ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఫోటోను మెగా అభిమానులు తెగ షేర్ చేస్తూ ఉన్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో చెర్రీ ఐఏఎస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని.. రాజ‌కీయ‌ వ్య‌వ‌స్థ‌కు, ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌కు మ‌ధ్య జ‌రిగే పోరాట‌మే ఈ సినిమా క‌థాంశ‌మ‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిన‌దే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి లీక్ అయిన ఓ ఫోటో ఒక్క‌సారిగా అంచ‌నాలు పెంచేసింది. అంచ‌నాలే లేకుం సినిమా క‌థ‌కు సంబంధించి కూడా ప‌లు అనుమానాల‌కు కార‌ణంగా మారింది ఈ ఫోటో.


మ‌రొక వైపు రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. అయిత ఈ పాత్ర అచ్చంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స‌ర్పంచ్‌ల‌ను పోలి ఉంద‌ని.. దీంతో రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమాలో రాజ‌కీయ నాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడ‌నే చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. దీంతో సినిమాపై ఒక్క‌సారిగా అంద‌రిలోనూ ఆస‌క్తి పెరిగింది. 1980లో ప్లాష్ బ్యాక్ నేప‌థ్యంలో కొన్ని స‌న్నివేశాలు ఉండ‌నున్నాయ‌ని తెలుస్తోంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వార్త‌లో ఎంత వ‌ర‌కు వాస్త‌వం అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా ఒక్క ఫోటోతో రామ్ చ‌ర‌ణ్-శంక‌ర్‌ల సినిమాపై ఊహ‌గానాలు భారీగా పెరిగాయి.

Also Read :  ప్ర‌ముఖ న‌టుడు జిమ్మీ వాంగ్ యు క‌న్నుమూత

Visitors Are Also Reading