మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో రామ్ చరణ్. చిరుత సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే అభిమానులను మెప్పించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక రామ్ చరణ్ ను ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మగధీర సినిమా నిలబెట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు చేస్తూ రామ్ చరణ్ టాలీవుడ్ లో బిజీ అయిపోయారు.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ తనలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇక ప్రస్తుతం ఆచార్యతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమా రామ్ చరణ్ నటించారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ పాన్ ఇండియా స్టార్ గా పరిచయం కాబోతున్నారు. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ఫ్యామిలీ జీవితం విషయానికి వస్తే కొన్ని ఆసక్తికర విషయాలు కూడా ఉన్నాయి.
రామ్ చరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసన కొణిదెల ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేని ఉపాసనను రామ్ చరణ్ పెళ్లి చేసుకోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు అవ్వడమే కాకుండా ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసట. అంతేకాకుండా ఇద్దరి అభిరుచులు కూడా ఒకేలా ఉంటాయి.
ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి అది కాస్త పెళ్లి వరకు దారి తీసింది. అయితే ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే రామ్ చరణ్ కంటే ఉపాసన వయసులో పెద్దది. వీరిద్దరి మధ్య నాలుగేళ్ల ఏజ్ గ్యాప్ ఉందట. అయితే ఉపాసన నాలుగేళ్లు పెద్దది అయినప్పటికీ చరణ్ కు ఆమె అంటే ఎంతో ఇష్టం ఉండటం వల్ల మెగా కుటుంబ సభ్యులు ఈ పెళ్ళికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
Also read :సినీ నటి సౌందర్య లవ్ స్టోరీ గురించి తెలుసా..?